Amazon staff arrested : అమెజాన్ సిబ్బంది చేతివాటం.. 15 లక్షల విలువచేసే ఆర్డర్లు మాయం!

శంషాబాద్ ఎయిర్‌ పోర్టులోని అమెజాన్ కంపనీలో పనిచేస్తూ కస్టమర్ల ఆర్డర్లకు సంబంధించిన సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్ లు, ఎలక్ట్రానిక్ పరికరాలను మాయం చేస్తూ వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను ఎయిర్ పోర్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Last Updated : Feb 19, 2020, 06:25 PM IST
Amazon staff arrested : అమెజాన్ సిబ్బంది చేతివాటం.. 15 లక్షల విలువచేసే ఆర్డర్లు మాయం!

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌ పోర్టులోని అమెజాన్ కంపనీలో పనిచేస్తూ కస్టమర్ల ఆర్డర్లకు సంబంధించిన సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్ లు, ఎలక్ట్రానిక్ పరికరాలను మాయం చేస్తూ వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను ఎయిర్ పోర్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి భారీ మొత్తంలో సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తుసామాగ్రి మొత్తం విలువ రూ. 15 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. అయితే, తమ ఆర్డర్ల డెలివరీలో మోసం జరుగుతోందని కస్టమర్ల దగ్గర నుంచి వరుసగా ఫిర్యాదులు రావడంతో సమస్య పరిష్కారంపై దృష్టిసారించిన అమెజాన్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

అమెజాన్ నిర్వాహకుల ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు.. తమదైన స్టైల్లో దర్యాప్తు చేపట్టారు. కొంతమంది సిబ్బందిని విచారించిన పోలీసులు.. అమెజాన్ కంపెనీలో మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను గుర్తించి వారిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టిన సందర్భంగా.. వారి చోరీలకు సంబంధించిన పూర్తి వివరాలను శంషాబాద్ ఏసీపీ అశోక్ కుమార్ గౌడ్ మీడియాకు వెల్లడించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News