ఆత్మహత్య చేసుకున్న మరో ఇంటర్ విద్యార్థి

ఆత్మహత్య చేసుకున్న మరో ఇంటర్ విద్యార్థి

Updated: Apr 23, 2019, 10:51 PM IST
ఆత్మహత్య చేసుకున్న మరో ఇంటర్ విద్యార్థి
Representational image

వరంగల్ రూరల్: తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు నిర్లక్ష్యం కారణంగా ఇంటర్ చదువుతున్న విద్యార్థిని, విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకమైంది. ఫలితాల వెల్లడి, జవాబు పత్రాల మూల్యాంకనంలో చోటుచేసుకున్న తప్పిదాలు తమ భవిష్యత్‌పై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయోనని ఆందోళన చెందుతున్న విద్యార్థుల్లో కొంతమంది అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఇంటర్ విద్యార్థులు అలా బలవన్మరనాలకు పాల్పడగా తాజాగా మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో ఈ పరిస్థితి ఎక్కడికి దారితీస్తుందోననే ఆందోళన అటు విద్యార్థుల్లో ఇటు వారి తల్లిదండ్రుల్లో కనిపిస్తోంది. 

ఇంటర్ ఫెయిల్‌ అయ్యాననే ఆందోళనతో వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలం మత్తడితండాకు చెందిన ఇంటర్‌ విద్యార్థి బానోతు నవీన్ ఇంటికన్నె రైల్వేస్టేషన్‌ వద్ద ఆత్మహత్య చేసుకోవడంతో ఆ విద్యార్థి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.