హైదరాబాద్: ఉద్యోగుల ప్రమోషన్లలో బీసీ లకు రిజర్వేషన్ అంశం పరిశీలించాలని, రవీంద్రభారతిలో బీసీ టీచర్స్ యూనియన్ డైరీ, క్యాలెండర్ ను ఆవిష్కరించిన సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కుల నిర్మూలన మా ప్రభుత్వ లక్ష్యమని, కులం లేకుండా అందరూ సమంగా ఎదగాలి అనే కోణంలో పని చేస్తున్నామని ఆయన అన్నారు. సమాజంలో అందరూ సమానంగా ఎదిగే వరకు వెనుకబడ్డ వాళ్ళకి చేయూత అందించాల్సి ఉంటుందని, బీసీ, మైనారిటీ రెసిడెన్సీయల్ స్కూల్స్ ఏర్పాటు చేసి విద్యార్థులకు మెరుగైన విద్య అందిస్తున్నామని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ప్రతి ఉపాధ్యాయుడి సేవలు వృధా పోకుండా చూస్తున్నామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు మన సొంత పిల్లలు అనే భావనతో చదువు చెప్పాలని, ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న అధికారికి, కార్పొరేట్ స్కూల్ లో చదువుకున్న అధికారికి పనులు చేసే విషయంలో తేడా ఉంటుందని అన్నారు. పేదరికం నుండి వచ్చిన వారు మన బాధలు త్వరగా అర్దం చేసుకోగలుగుతున్నారని అన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..