హైదరాబాద్ లో బీజేపి నేతల హౌజ్ అరెస్ట్

హైదరాబాద్ లో బీజేపి నేతల హౌజ్ అరెస్ట్

Updated: Nov 9, 2019, 05:35 PM IST
హైదరాబాద్ లో బీజేపి నేతల హౌజ్ అరెస్ట్

హైదరాబాద్: బీజేపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డా కె లక్ష్మణ్ ను హైదరాబాద్ పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. టిఎస్ఆర్టీసీ చేపట్టిన ఛలో ట్యాంక్ బండ్ ర్యాలీలో పాల్గొని కార్మికులకు మద్దతుగా నిలవనున్నట్టు లక్ష్మణ్ ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఎక్కడికీ వెళ్లడానికి వీల్లేకుండా శనివారం ఉదయమే పోలీసులు ఆయనను హౌజ్ అరెస్ట్ చేశారు. అంతేకాకుండా ఇంటి బయట భారీ సంఖ్యలో పోలీసులను మొహరించారు. దీంతో తమ నాయకుడిని విడుదల చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ బీజేపి శ్రేణులు నిరసన చేపట్టాయి. 

మరోవైపు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురిని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ ఏసీపీ కె ఎస్ రావు, ఇన్స్పెక్టర్ కళింగరావు, ఎస్సై శ్రీనివాస్ నేతృత్వంలోని బృందం ఆయనను హౌస్ అరెస్ట్ చేసి నివాసం ఎదుట భారీ సంఖ్యలో పోలీసులను మొహరించారు. తనను హౌజ్ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించిన ఎంపీ అర్వింద్ ధర్మపురి.. ఆర్టీసీ కార్మికులకు సంఘీభావంగా వెళ్తోన్న తనను ఇలా గృహనిర్భందం చేయడం ఏంటని ప్రశ్నించారు. మిలియన్ మార్చ్ తోనే కేసీఆర్ పతనం ప్రారంభమైందని ఎంపీ అర్వింద్ ధర్మపురి ఆగ్రహం వ్యక్తంచేశారు.