Raghunandan Rao: మోదీ కాలిగోరు వెంట్రుకతో రేవంత్ సమానంకాదు.. ఫైర్ అయిన బీజేపీ రఘనందన్ రావు..

Raghunandan Rao:బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు, సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. దేశప్రధాని గురించి మాట్లాడే స్థాయి, రేవంత్ కు లేదన్నారు. నోరు అదుపులో ఉంచుకుని మాట్లాడాలని హితవు పలికారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 23, 2024, 06:59 PM IST
  • సీఎం రేవంత్ పై మండిపడిన రఘనందన్ రావు..
  • నీకంటే రెండు ఆకులు ఎక్కువే చదివానంటూ వ్యాఖ్యలు..
Raghunandan Rao: మోదీ కాలిగోరు వెంట్రుకతో రేవంత్ సమానంకాదు.. ఫైర్ అయిన బీజేపీ రఘనందన్ రావు..

BJP Raghunandan Rao Fires On CM Revanth Reddy: దేశ ప్రధాని నరేంద్ర మోదీ గురించి మాట్లాడే అర్హత సీఎం రేవంత్ కులేదని బీజేపీ రఘనందన్ రావు అన్నారు. మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘనందన్ రావు హనుమాన్ జయంతి రోజున ఆగ్రహాంతో ఊగిపోయారు. అంతేకాకుండా.. రేవంత్ కన్నా.. తాను రెండు ఆకులు ఎక్కువే చదివానంటూ ఫైర్ అయ్యారు. పీఎం మోదీ వెన్నులో వణుకు పుట్టిందని ఇటీవల తెలంగాణ సీఎంరేవంత్ ఎన్నికల ప్రచారంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా, బీజేపీ ఎంపీ అభ్యర్థి దుబ్బాక రఘనందన్ రావు కౌంటర్ ఇచ్చారు. తను కూడా సీఎం రేవంత్ భాషను మాట్లాడగలనని, కానీ ఎందుకులే అనిఊరుకుంటున్నట్లు మీడియాతో అన్నారు. ఇదిలా ఉండగా తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొలది నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

Read more: Komatireddy Venkat Reddy: కేసీఆర్ ఉంటడో పోతడో తెల్వదు.. పండుగ పూట సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..

కాంగ్రెస్ సీఎం రేవంత్ మాట్లాడుతూ.. కేసీఆర్ నుజైలు కు పంపడం ఖాయమంటూ వ్యాఖ్యలుచేస్తున్నారు. కేసీఆర్ ఫార్మ్ హౌస్ లో ఉరివేసుకున్న కూడా ఆయనకు ప్రజలు అధికారం ఇవ్వరంటూ వ్యాఖ్కలు చేస్తున్నారు. మరోవైపు.. మాజీ సీఎం కేసీఆర్ బస్సుపై కాదు కాదా... మోకాళ్లపై తెలంగాణ అంతట యాత్రలు చేసిన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కేసీఆర్ ఉంటడో పోతాడో తెల్వదు... తాను మాట్లాడుతున్నది.. తండ్రి కొడుకులు ఇద్దరు జైలుకు వెళ్లడం గురించి అని చమత్కరించారు. నల్లొండ , భువనగిరిలో కేసీఆర్, కేటీఆర్ ఎంత ప్రచారం చేసిన కూడా డిపాజిట్ కూడా రాదన్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు కూడా అంతే స్థాయిలో సీఎంరేవంత్ పై మండిపడుతున్నారు.

బీఆర్ఎస్ కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి కొత్త మోసం మొదలపెట్టాడని వ్యాఖ్యలు చేశారు. మోసం పార్ట్ 1 అసెంబ్లీ ఎన్నికల కోసం చేశాడు. అమలకు సాధ్యంకానీ హమీలన్ని ఇచ్చి ఇప్పుడు ముఖం చాటేశారన్నారు. ప్రజలు ఎమైన అడిగితే నోటికొచ్చినట్లు తిడుతూ దాడులు చేస్తున్నారన్నారు. ఇక.. ఇప్పుడు రుణమాఫీ ఆగస్ట్ 15 నాడు  అందరికి చేస్తానంటూ పార్లమెంట్ ఎన్నికల కోసం మరో మోసానికి సీఎంకేసీఆర్ కొత్త మోసానికి తెరతీశారన్నారు. మోసం పార్ట్ 2 కోసం రేవంత్ ఇప్పటినుంచి ప్రచారం చేస్తున్నడని గుర్తు చేశాడు.

Read More: MLA Raja Singh: గాల్లో బాణం వేస్తే కేసులు పెడతారా.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్..

రైతుబంధునే సక్కగ వెయ్యనోడు 40 వేల కోట్ల రుణమాఫీ చేస్తాడా? .. అంటూ రేవంత్ పై ఎద్దేవా చేశారు. ఒక్కసారి ఒక మనిషి చేతిలో మోసపోతే మోసం చేసిన వాడిది తప్పు.. మళ్లీ రెండో సారి కూడా అదే మనిషి చేతిలో మోస పోతే తప్పు మనది అవుతుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో రేవంత్ పై మండిపడ్డారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం తెలంగాణలో అన్ని పార్టీలు చేస్తున్న కామెంట్లతో, సమ్మర్ లో మరింత హీట్ ను పెంచుతున్నాయి.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News