CM KCR: నేడు టీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ

టీఆర్ఎస్ పార్టీ ఎంపీలతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు భేటీ కానున్నాయి. ఈ 14న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కొన్ని కీలక విషయాలపై, తమ ఎజెండాపై పార్టీ ఎంపీలతో కేసీఆర్ చర్చించనున్నారు (CM KCR Meeting with TRS MPs).

Last Updated : Sep 10, 2020, 08:41 AM IST
CM KCR: నేడు టీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ

తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నేడు భేటీ కానున్నారు. నేటి (సెప్టెంబర్ 10న) మధ్యాహ్నం బేగంపేటలోని ప్రగతిభవన్‌లో పార్టీ ఎంపీలతో టీఆర్ఎస్ అధినేత సమావేశం (KCR Meeting with TRS MPs) కానున్నారు. సెప్టెంబర్ 14వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహంపై టీఆర్ఎస్ ఎంపీలతో కేసీఆర్ చర్చించనున్నారని సమాచారం. Gold Rate Today: బంగారం ధరలు పైపైకి.. వెండి పతనం

కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సంస్కరణలు, జీఎస్టీ, రాష్ట్రానికి సంబంధించిన పలు ఇతర విషయాలపై తమ వైఖరి ఏమిటి, కేంద్రాన్ని ఏ విషయంపై ప్రశ్నించాలన్న దానిపై చర్చ జరగనుంది. ఇదివరకే కేంద్రం తీరుపై సీఎం కేసీఆర్, పలువురు రాష్ట్ర మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం వైఖరికి తగినట్లుగా ఏం చేయాలన్న దానిపై సమావేశంలో పాల్గొనే సీనియర్ అధికారులు వివరాలు అందజేయనున్నారు. Mahesh Babu New Look: మహేష్ బాబు న్యూ లుక్ చూశారా..?

ఫొటో గ్యాలరీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x