CM KCR National Tour: జాతీయ రాజకీయాలపై కేసీఆర్ గురి.. నేటి నుంచి జాతీయ స్థాయి పర్యటన...

CM KCR National Tour: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్న సీఎం కేసీఆర్ కొంతకాలంగా జాతీయ స్థాయి పర్యటన చేపట్టాలనే ఆలోచనలో ఉన్నారు. తాజాగా కేసీఆర్ జాతీయ స్థాయి పర్యటన ఖరారైంది. నేటి నుంచి ఈ నెల 27 వరకు ఆయన వివిధ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 20, 2022, 12:12 AM IST
  • సీఎం కేసీఆర్ జాతీయ స్థాయి పర్యటన
  • వివిధ రాష్ట్రాల్లో పర్యటించనున్న సీఎం కేసీఆర్
  • సామాజిక, రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొననున్న కేసీఆర్
CM KCR National Tour: జాతీయ రాజకీయాలపై కేసీఆర్ గురి.. నేటి నుంచి జాతీయ స్థాయి పర్యటన...

CM KCR National Tour: జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... అందుకోసం ప్రత్యామ్నాయ ఎజెండాను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ తాజాగా జాతీయ స్థాయి పర్యటనకు సిద్ధమవుతున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పర్యటించనున్న ఆయన... వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కానున్నారు. అలాగే ఆర్థికవేత్తలు, మేదావులు, ఆయా రంగాలకు చెందిన ప్రముఖులను కేసీఆర్ కలవనున్నారు. శుక్రవారం (మే 20) ఢిల్లీ పర్యటనతో మొదలుకానున్న కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్ టూర్... ఏడు రోజుల పాటు సాగనుంది.

కేసీఆర్ టూర్ వివరాలు :

శుక్రవారం (మే 20) మధ్యాహ్నం  సీఎం కేసీఆర్ ఢిల్లీలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశమవుతారు. అలాగే, ప్రముఖ ఆర్థికవేత్తలతో భేటీ అవుతారు.  దేశ ఆర్థిక పరిస్థితులపై వారితో చర్చిస్తారు. చర్చించనున్నారు. పలువురు ప్రముఖ జాతీయ మీడియా సంస్థల జర్నలిస్టు ప్రముఖులతోనూ కేసీఆర్ భేటీ అవుతారు.

మే 22వ తేదీన మధ్యాహ్నం కేసీఆర్ ఢిల్లీనుంచి చండీగఢ్  పర్యటనకు వెళ్తారు. గతంలో ప్రకటించిన విధంగా జాతీయ రైతు ఉద్యమంలో అసువులు బాసిన సుమారు 600 రైతు కుటుంబాలను సీఎం కేసీఆర్ పరామర్శిస్తారు. ఈ సందర్భంగా వారికి ఆర్థికంగా భరోసా అందిస్తారు. ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెక్కుల పంపిణీ చేస్తారు.  ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్‌లతో కలిసి కేసీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 

మే 26న సీఎం బెంగళూరులో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా మాజీ భారత ప్రధాని దేవగౌడ కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో భేటీ అవుతారు. 

బెంగుళూరు నుంచి మే 27 తేదీన రాలేగావ్ సిద్ది పర్యటనకు వెళ్తారు. అక్కడ ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో భేటీ అవుతారు.  అటు నుంచి  సాయిబాబా దర్శనం కోసం సీఎం కేసీఆర్ షిరిడీ వెళతారు. అక్కడి నుంచి తిరిగి హైద్రాబాద్ చేరుకుంటారు. అటు తర్వాత, మే 29 లేదా 30 న సీఎం కేసీఆర్ బెంగాల్, బీహార్ రాష్ట్రాల పర్యటనకు వెళ్తారు.  గాల్వాన్ లోయలో వీరమరణం పొందిన భారత సైనిక కుటుంబాలను పరామర్శిస్తారు. గతంలో ప్రకటించిన హామీ మేరకు ఆ కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తారు. 

Also Read: Nikhat Zareen: వుమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌‌గా తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్...   

Also Read : Nallala Odelu Joins Congress: కాంగ్రెస్‌ గూటికి నల్లాల ఓదెలు.. ప్రియాంక గాంధీ సమక్షంలో చేరిక.. ఇక బాల్క సుమన్‌తో 'ఢీ'..! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News