హైదరాబాద్ ( Hyderabad ) లోని డబీర్ పూరలో ఉన్న జహాంగీర్ డైరీ ఫాంలో ఒక సిబ్బంది పాలను పితికి సగం తాగి , ఎంగిలి చేసిన గ్లాస్ లోని మిగిలిన పాలను బకెట్ లో పోశాడు. దీనికి సంబంధించిన షాకింగ్ వీడియో బాగా వైరల్ ( Viral Video ) అయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు. జహంగీర్ డెయిరీ ఫాం యజమాని మహ్మద్ సోహైల్‌ను అరెస్ట్ చేశారు. కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ పెరుగుతున్న సమయంలో పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం.. కస్టమర్లు మాస్కు వేసుకుని వస్తే పాలు ఇస్తాం లేదంటే లేదు అనే బోర్డు జహాంగీర్ డైరీ ఫాం గేటుపై కనిపిస్తుంది, దాంతో స్థానికులు వీళ్లు బాగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనుకుని పాలు కొనడం కొనసాగిస్తున్నారు.
కానీ లోపల సిబ్బంది చేసే నిర్వాకం అది పెను పాపం కన్నా దారుణం. పాలను తాగి బకెట్ లో పోశాక...అదే ముంతను గేదెలు కుడితి తాగే నీటి తొట్టేలో ముంచి అందులోంచి నీళ్లు తీసుకుని బకెట్ లో పోశాడు. ఈ వీడియో చూసి మరీ ఇంత దారుణమా.. ప్రజల ప్రాణాలతో ఈ విధంగా చెలగాటం ఆడటమా అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ జహంగీర్ డైరీ ఫాం ఓనర్ మహ్మద్ సోహైల్ ను అదుపులోకి తీసుకున్న డబీర్ పుర పోలీసులు
సోహైల్ కు చెందిన డైరీ ఫామ్ లో పాలను అపరిశుభ్రం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్
డైరీ ఫామ్ పై నుంచి వీడియో తీసిన కొందరు వ్యక్తులు#JahangirFarm #Dabirpura@hydcitypolice pic.twitter.com/mc6v93VAf0
— ZEE HINDUSTAN తెలుగు (@ZeeHTelugu) August 19, 2020
Shocking Video: పాలను ఎలా కల్తీ చేస్తున్నాడో మీరే చూడండి...