Donthi Madhava Reddy: మాజీ ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన పెను ప్రమాదం

Donthi Madhava Reddy: మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వరంగల్ - హైదరాబాద్ ప్రధాన రహదారి మీదుగా హన్మకొండ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా మార్గమధ్యలో ఆయన కారు అదుపు తప్పి బోల్తా పడింది. 

Last Updated : Jan 4, 2021, 05:56 PM IST
  • మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి తృటిలో తప్పిన పెను ప్రమాదం
  • వరంగల్ నుంచి హైదరాబాద్ వస్తుండగా రోడ్డు ప్రమాదం
  • ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో మాజీ ఎమ్మెల్యేకు తప్పిన ప్రాణాపాయం
Donthi Madhava Reddy: మాజీ ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన పెను ప్రమాదం

Donthi Madhava Reddy: మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వరంగల్ - హైదరాబాద్ ప్రధాన రహదారి మీదుగా హన్మకొండ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా మార్గమధ్యలో ఆయన కారు అదుపు తప్పి బోల్తా పడింది. 

జనగామ పోలీసుల కథనం ప్రకారం.. మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తన ఇన్నోవా కారులో హన్మకొండ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. ఈ క్రమంలో జిల్లాలోని ఇందిరమ్మ కాలనీ వద్దకు రాగానే మాధవ రెడ్డి కారు అదుపుతప్పి రోడ్డు ప్రమాదాని(Road Accident)కి గురైంది. ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన అనంతరం ఇన్నోవా బోల్తా కొట్టింది. 

Also Read: EPFO శుభవార్త.. మీ PF రెట్టింపు చేసుకోండి.. మరెన్నో లాభాలు!

ఇన్నోవాలోని ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో దొంతి మాధవరెడ్డికి ప్రాణాపాయం తప్పింది. స్వల్ప గాయాలతో ఆయన బయటపడ్డారు. మాధవరెడ్డితో పాటు కారు డ్రైవర్‎, మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. దొంతి మాధవరెడ్డి మరో వాహనంలో హైదరాబాద్(Hyderabad) బయలురేరి వెళ్లారు. గాయపడ్డ ద్విచక్ర వాహనదారుడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించినట్లు సమాచారం.

Also Read: PF Balance Check: మీ ఖాతాల్లోకి వడ్డీ జమ.. పీఎఫ్ బ్యాలెన్స్ ఇలా చెక్ చేసుకోండి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News