Harish Rao Reacts On Jainoor Incident: రేవంత్ సర్కారుపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యాచారాలు పెరిగిపోయాయని.. మహిళలకు భద్రత కరువైందన్నారు. 9 నెలల్లో 1900 అత్యాచారాలు జరిగాయని మండిపడ్డారు. జైనూరు అత్యాచార బాధితురాలిని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి పరామర్శించారు. జైనూరు ఘటన ఘటన అత్యంత పాశవిక ఘటన అని హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలో అత్యాచారాలు నిత్యకృత్యం అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ మీద ఎస్ఐ అత్యాచార యత్నం చేయడం దారుణమన్నారు.
Also Read: Bank Locker Rules: బ్యాంకులో లాకర్ తీసుకునేవారికి అలర్ట్..ఆర్బిఐ కొత్త గైడ్లెన్స్ ఇవే
ఇలాంటివి అనేక ఘటనలు జరిగాయని.. 9 నెలల కాంగ్రెస్ పాలనలో మహిళలపై 1900 అత్యాచారాలు జరిగాయన్నారు హరీశ్ రావు. ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందన్నారు. తెలంగాణ వస్తే నక్సలైట్లు రాజ్యం ఏలుతారని.. శాంతి భద్రత కొరవడుతుందని అపోహలు సృష్టించారని గుర్తు చేశారు. కేసీఆర్ పదేళ్లు తెలంగాణను అద్భుతంగా పాలించారని.. శాంతి భద్రతలను పటిష్టంగా అమలు చేశారని అన్నారు. కాంగ్రెస్ పాలకులు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతిస్తున్నారని.. రాష్ట్ర ప్రతిష్ట మసకబారుతోందన్నారు.
రాష్ట్రంలో స్మగుల్డ్ వెపన్స్ బయటపడుతున్నాయని.. ఒకప్పుడు బిహార్‌లో ఉండే నాటు తుపాకులు ఇప్పుడు తెలంగాణలో రాజ్యం ఏలుతున్నాయన్నారు. 2018 నుంచి 2023 వరకు 5 ఇళ్లలో కేవలం 200 నాటు తుపాకులు దొరికాయన్నారు. కొత్త డీజీపీ వచ్చిన తరువాత 4 మత కలహాలు జరిగాయని.. మొత్తం వ్యవస్థ నాశనం అయిందన్నారు. మెదక్‌లో సరిగా లేరన్న డీసీపీని తెచ్చి హైదరాబాద్‌లో పోస్టింగ్ ఇచ్చారని అన్నారు. కేంద్ర హోమ్ శాఖ జోక్యం చేసుకుని రక్షణ వ్యవస్థను పటిష్ఠం చేయాలని డిమాండ్ చేశారు. డయల్ 100 కూడా పని చేయడం లేదని.. పోలీసులను ప్రభుత్వం పని చేయనీయడం లేదన్నారు.
"ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు. వరద నిర్వహణ, సహాయం, రుణ మాఫీ, విద్యా వ్యవస్థను నడపటంలో ఫెయిల్ అయ్యారు. ప్రతిపక్షాలను వేధించడం, కండువాలు కప్పటంలో సీఎం బిజీగా ఉన్నారు. ఖమ్మంలో ఎన్‌కౌంటర్ జరిగి 10 మంది చనిపోయారు. దశాబ్ద కాలంలో ఒక్క బుల్లెట్ శబ్దం కూడా లేదు. ఫిక్ ఎన్‌కౌంటర్లు చేస్తున్నారు. జైనూరు బాధితురాలికి 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి.." అని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.