Harish rao fires on cm revanth reddy: ఒక ఐఏఎస్ అధికారి అయి ఉండి అలా మాట్లాడొచ్చా?.. మీరు పోయి పొంగులేటిని కలిస్తే చేతిలో ఏది ఉంటే అదే తీసుకొని కొడుతాడని ఉద్యోగులతోమాట్లాడుతుండటం ఎంత వరకు కరెక్ట్ అని అధికారిపై ఫైర్ అయ్యారు. అంతే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంను ఏకీపారేశారు.
Harish Rao House Arrest News: సనత్‌నగర్ TIMS ఆసుపత్రిని సందర్శించాలన్న తన నిర్ణయం నేపథ్యంలో బీఆర్ఎస్ నేత హరీష్ రావును బుధవారం కోకాపేటలోని ఆయన నివాసంలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య నెలకొన్న రాజకీయ వివాదం దృష్ట్యా, ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Harish Rao House Arrest News: సనత్‌నగర్ TIMS ఆసుపత్రిని సందర్శించాలన్న తన నిర్ణయం నేపథ్యంలో బీఆర్ఎస్ నేత హరీష్ రావును బుధవారం కోకాపేటలోని ఆయన నివాసంలో పోలీసులు గృహ నిర్బంధించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య నెలకొన్న రాజకీయ వివాదం దృష్ట్యా, ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే తనను అడ్డుకున్న పోలీసులను హరీష్ రావు నెట్టవేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.
Harish Rao on Kaleshwaram Project: గోదావరిలో సమృద్ధిగా నీటి ప్రవాహం ఉన్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుల నుంచి నీటిని ఎత్తిపోయకుండా నిర్లక్ష్యం వహిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. జీ తెలుగు న్యూస్‌తో హరీష్ రావు మాట్లాడుతూ.. దేవాదుల ప్రాజెక్ట్ కింద 10 మోటార్లకు గానూ కేవలం 5 మోటార్లు మాత్రమే నడిపిస్తూ ఉద్దేశపూర్వకంగా నీటిని నిలిపివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాభావంతో ఉన్న వరంగల్, హన్మకొండ జిల్లాల రైతులకు దేవాదుల ద్వారా సాగునీరు ఇచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే దేవాదుల పనులను పూర్తి చేసి 3.50 లక్షల ఎకరాలకు నీరు అందించామని చెప్పారు.
Harish Rao Annaram Sundilla Barrages Issue: రేవంత్ రెడ్డి పంతానికి పోయి రాష్ట్రాన్ని ఫణంగా పెడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. జీ తెలుగు న్యూస్‌తో హరీష్ రావు మాట్లాడుతూ.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను చెక్ చేసుకోవాలని NDSA సలహా ఇచ్చిందన్నారు. ఈరోజు ఉన్న పరిస్థితుల్లో అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో నీళ్లు లిఫ్ట్ చేసి మినిమం లెవెల్ మెయింటెయిన్ చేసి ఎల్లంపల్లికి నీళ్లు తెచ్చే అవకాశం ఉందని రిటైర్డ్ ఇంజినీర్లు చెప్పారని గుర్తు చేశారు. చిన్న రబ్బర్ డ్యాం, కాఫర్ డ్యాం వేసి నీళ్ళు లిఫ్ట్ చేద్దామని ప్రస్తుత ఇరిగేషన్ శాఖ కూడా ప్రభుత్వానికి లేఖ రాసిందన్నారు. వీళ్లు చెప్పింది వినకుండా.. శాస్త్రి లాంటి నిపుణులు చెప్పింది వినకుండా రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ఫణంగా పెడుతున్నారని ఫైర్ అయ్యారు.
Telangana Govt Employees Health Card: కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. నేటి ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పిన మాటలు ఏమయ్యాయని నిలదీశారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే హెల్త్ కార్డులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
Harish Rao: సహాయం పొంది మర్చిపోయే ఈ రోజుల్లో, తనకు ఇంజనీరింగ్ సీటు ఇప్పించిన మాజీ మంత్రి హరీష్ రావుకు రోహిత్ అనే యువకుడు కృతజ్ఞత చాటుకున్నాడు. తన చదువుకు సహకరించినందుకు గాను, హరీష్ రావు చేస్తున్న ప్రజాసేవలో తోడుంటానని చెబుతూ, తన వార్షిక వేతనంలో సగం భాగామైన రూ.6 లక్షలను విరాళంగా ఇచ్చాడు. ఆ యువకుడు తీసుకున్న ఈ నిర్ణయానికి హరీష్ రావు ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు.
Harish Rao Vs Jupally Krishna Rao: జూపల్లి కృష్ణారావుకు చీము నెత్తురు ఉంటే వెంటనే రాజీనామా చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. నిన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 8 లక్షల కోట్లు అప్పు చేసిందని ఆరోపణలు చేశారని.. ఈరోజు 7 లక్షల కోట్లు అప్పు చేసిందని అంటున్నారని ఒక్క రోజులోనే లక్ష కోట్ల అప్పు తగ్గించాడని ఫైర్ అయ్యారు. ఈరోజు చర్చకు వచ్చి ఉంటే 4 లక్షల కోట్లు అని తేలిపోయేదన్నారు. కేటీఆర్ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరితే.. జూపల్లి కృష్ణారావు తెలంగాణ భవన్‌కు వస్తానని, ఈరోజు సబ్జెక్ట్ లేక తోక ముడిచి వెళ్ళిపోయారని ఎద్దేవా చేశారు.
Harish Rao: తమ ఫోన్లు, సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారంటూ మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. కొంతమంది ఐపీఎస్ అధికారులు ఈ వ్యవహారంలో భాగమై ఉన్నారని.. బెంగళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్లను తీసుకొచ్చి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉంచి బీఆర్ఎస్ నేతలపై నిఘా పెట్టించారని ఫైర్ అయ్యారు. తమ వద్ద పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నాయని.. సరైన సమయంలో వాటిని బయటపెడతామన్నారు. అలాగే భవిష్యత్తులో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Harish Rao Fires on CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ప్లాన్ ప్రకారం డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. తెలంగాణకు అన్యాయం జరిగితే ఒక్క నిమిషం కూడా ఊరుకోమని హెచ్చరించారు.
Kavitha Targets On Harish Rao: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇప్పుడు సిద్ధిపేట నియోజకవర్గంపై టార్గెట్ పెంచారు. పార్టీ నుంచి వైదొలగే టైమ్ నుంచి మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుపై ఫోకస్ పెట్టిన కవిత.. ఇప్పుడు పూర్తిగా సిద్ధిపేటపై రాజకీయాలు మొదలెట్టినట్లు సమాచారం.
Harish Rao Slams CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. మూసీ నది కంపు కంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల కంపు ఎక్కువైపోయిందని విమర్శించారు. కేసీఆర్‌పై ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్‌ను ఖండిస్తున్నామన్నారు.
Jubilee Hills By Elections: బీఆర్ఎస్ పార్టీలో ఆ ఇద్దరు కీలక నేతలు..! పార్టీ అధికారంలో ఉండగా.. రెండు పవర్ సెంటర్లుగా ఓ వెలుగు వెలిగారు..! ఇద్దరు నేతలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించింది చాలా తక్కువ సార్లు మాత్రమే.. కానీ పార్టీలో కవిత ఎపిసోడ్ ఆ ఇద్దర్ని పూర్తిగా మార్చేసిందా..! ఇప్పుడు ఎక్కడా చూసినా ఇద్దరు లేని సీనే కనిపించడం లేదా..! అయితే ఇద్దర్ని ఒకచోట చూసిన గులాబీ దళం ఫుల్ ఖుషీ అవుతోందా..! ఇంతకీ ఆ ఇద్దరు నేతలు ఎవరు..!
Harish Rao Vs Kavitha: కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని.. ప్రస్తుతం ఏ శాఖలో చూసినా అవినీతి పెరిగిపోయిందని హరీష్ రావు విమర్శించారు. కాళేశ్వరం మీద లక్ష కోట్లు పోయాయని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
Harish Rao Fires on Nara Lokesh: తెలంగాణ వాటా తేల్చకుండా బనకచర్ల ప్రాజెక్ట్‌ను ఎలా కడతారో చూస్తామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్ కట్టితీరుతామని అంటామని.. సుప్రీం కోర్టుకు వెళ్లి అయినా అడ్డుకుంటామన్నారు.
Kaleshwaram Project Commission Investigation: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై విచారణకు మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. కమిషన్ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. కమిషన్ సభ్యులు ఏం అడిగారు..? హరీష్ రావు ఏం చెప్పారు..? వివరాలు ఇలా..
Harish Rao: మాజీమంత్రి హరీశ్ రావు బర్త్‌డే పై కొత్త చర్చ మొదలైందా..! ట్రబుల్ షూటర్ బర్త్ డేను బీఆర్ఎస్ నేతలు మరిచిపోయారా..! ప్రతిసారి హరీష్ రావు బర్త్‌డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపే కేటీఆర్ కూడా ఈసారి విష్ చేయలేదు..! అటు కవిత కూడా హరీష్ రావుకు శుభాకాంక్షలు చెప్పలేదు..!
Harish Rao Get Tears In Siddipet: తండ్రి చనిపోయాడని.. తన తల్లి కష్టపడి చదివిస్తుందని ఓ చిన్నారి చెప్పి కథ విని స్టేజిపైనే కంటతడి పెట్టుకుని భావోద్వేగానికి లోనైన మాజీ మంత్రి హరీష్‌రావు . సిద్దిపేటలో పాఠశాల విద్యార్థులకు 'భద్రంగా ఉండాలి.. భవిష్యత్‌లో ఎదగాలి' అనే అవగాహన సదస్సు నిర్వహించగా ఈ సభలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు భావోద్వేగానికి లోనయ్యారు. ఆ చిన్నారిని ఓదార్చి పక్కనే కూర్చోబెట్టుకుని ధైర్యం నూరిపోశారు.
Harish Rao PA Arrest In Phone Tapping Case: తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు పీఏ అరెస్ట్ కావడం సంచలనం రేపింది. ఏం జరిగిందో తెలుసుకుందాం.
Harish Rao: భారత రాష్ట్ర సమితి (BRS) కీలక నేత మాజీ మంత్రి కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు జీ తెలుగు మీడియాకు ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్బంగా హరీష్ రావు జీ న్యూస్ తెలుగు ఛీఫ్ ఎడిటర్ భరత్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు వెల్లడించారు.
Harish Rao Fires on CM Revanth Reddy: రాష్ట్రంలో ఆర్ఎంపీలు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆర్ఎంపీలపై అక్రమ కేసులు పెట్టకుండా.. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలో ఆర్ఎంపీలకు ఇచ్చిన హామీను నెరవేర్చాలన్నారు.
Harish Rao Fires On Revanth Reddy: రైతు భరోసా కింద రూ.1500 ఇచ్చి.. రూ.12 వేలు ఎగ్గొడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. 5 గుంటలు ఉన్నందుకు రూ.12 వేలు ఇవ్వమని ప్రభుత్వం చెప్పడం శోచనీయమన్నారు.