acb searches in greenko over formula 2 case: తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కు హైకోర్టులో బిగ్ షాక్ ఎదురైందని చెప్పుకొవచ్చు. ఫార్మూలా ఈ రేసు ఘటనలో.. మంత్రిగా ఉండి అధికార దుర్వినియోగానికి పాల్పడి రాష్ట్ర ఖజానాకు భారీగా నష్టం కలిగేలా కేటీఆర్ గతంలో ఆదేశాలు జారీ చేశారన్నారు. ఈ క్రమంలో ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో అక్రమంగా డబ్బులు చెల్లించడంపై వచ్చిన అభియోగాల మేరకు ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
మరోవైపు.. కేటీఆర్ మాత్రం ఇదంతా రాజకీయ కుట్రలని.. తమపై ప్రతీకారం తీర్చుకుంటున్నారని కూడా రేవంత్ సర్కారుపై మండిపడ్డారు. ఈ క్రమంలో ఈ ఫార్మూలా ఈ రేసులో ఎలాంటి అక్రమాలు జరగలేదని కూడా కేటీఆర్ ఈ కేసును కొట్టివేయాలని కూడా క్వాష్ పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ క్రమంలో దీనిపై విచారణ చేసిన హైకోర్టు ధర్మాసనం కేటీఆర్ కు ట్విస్ట్ ఇచ్చింది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టివేసినట్లు తెలుస్తొంది.
ఈ క్రమంలో ఈ రోజుతో కేటీఆర్ అరెస్టుపై ఉన్న స్టే కూడా ఎత్తివేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఏసీబీ విచారణకు మార్గం సుగమమైందని చెప్పుకొవచ్చు. దీంతో ఏసీబీ అధికారులు ప్రస్తుతం దూకుడు పెంచినట్లు తెలుస్తొంది. ఫార్మూలా ఈ రేసింగ్ కేసులో.. హైదరాబాద్, విజవాడ గ్రీన్ కో, ఏస్ జెన్ నెక్ట్స్ ఆఫీసుల్లో రికార్డులను పరిశీలిస్తున్నట్లు తెలుస్తొంది. ఇదిలా ఉండగా.. మరోసారీ ఏసీబీ ముందుకు కేటీఆర్ ఈ నెల 9న హజరుకానున్నట్లు సమాాచారం.
Read more: KTR: తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ కి ఎదురుదెబ్బ.. పిటిషన్ రద్దు..!
మరొవైపు కేటీఆర్ నందినగర్ నివాసానికి హరిష్ రావు, కవిత, జగదీశ్వర్ రెడ్డి, తలసాని,న్యాయనిపుణులు చేరుకున్నట్లు తెలుస్తొంది. వీరితో ప్రస్తుతం కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం కేటీఆర్ ను మాత్రం ఏ నిముషమైన అరెస్ట్ చేయవచ్చని వాదనలు కూడా బలంగా విన్పిస్తున్నట్లు తెలుస్తొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.