GHMC Elections: నేరెడ్‌మెట్ టీఆర్ఎస్‌దే.. 56కు చేరిన గులాబీ కార్పొరేటర్ల సంఖ్య

గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (GHMC) ఎన్నికల్లో నిలిచిపోయిన నేరెడ్‌మెట్‌ (Neredmet) డివిజన్‌‌ ఫలితం వెల్లడైంది. ఈ డివిజన్‌‌లో టీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించారు. నేరెడ్‌మెట్ 136వ డివిజ‌న్‌ ఓట్ల లెక్కింపు అనంతరం 782 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్య‌ర్థి మీనా ఉపేందర్ రెడ్డి గెలుపొందారు.

Last Updated : Dec 9, 2020, 11:13 AM IST
GHMC Elections: నేరెడ్‌మెట్ టీఆర్ఎస్‌దే.. 56కు చేరిన గులాబీ కార్పొరేటర్ల సంఖ్య

GHMC Election - Neredmet Results: హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ( GHMC ) ఎన్నికల్లో నిలిచిపోయిన నేరెడ్‌మెట్‌ (Neredmet) డివిజన్‌‌ ఫలితం వెల్లడైంది. ఈ డివిజన్‌‌లో టీఆర్ఎస్ ( TRS ) అభ్యర్థి ఘన విజయం సాధించారు. నేరెడ్‌మెట్ 136వ డివిజ‌న్‌ ఓట్ల లెక్కింపు అనంతరం 782 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్య‌ర్థి మీనా ఉపేందర్ రెడ్డి గెలుపొందారు. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ కార్పొరేట‌ర్ల సంఖ్య 56కు చేరింది. స్వస్తిక్ గుర్తు కాకుండా ఇతర గుర్తులు ఉంటే ఎన్నికల రిటర్నింగ్ అధికారే తుది నిర్ణయం తీసుకోవచ్చని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. Also read: GHMC Elections: నేరెడ్‌మెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం

హైకోర్టు ఆదేశాలతో అధికారులు బుధవారం ఉదయం 8గంటలకు నెరేడ్‌మెట్ 136 డివిజన్‌లోని 544 ఓట్లను లెక్కించారు. అయితే 4వ తేదీన చేపట్టిన కౌంటింగ్‌లో 504 ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి లీడ్‌లో ఉన్నారు. తాజాగా చేసిన కౌంటింగ్ ప్రకారం.. టీఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్‌రెడ్డి 782 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. Also read; GHMC Election Results: ఎవరికీ దక్కని మెజారిటీ.. బలమైన పార్టీగా బీజేపీ

అయితే.. నేరెడ్‌మెట్ డివిజ‌న్ మొత్తంలో 25,176 ఓట్లు పోల‌య్యాయి. 4వ తేదీన కౌంటింగ్ రోజున 24,632 ఓట్లు మాత్రమే లెక్కించారు. మిగతా బ్యాలెట్ పత్రాలపై వేరే గుర్తులుండటంతో.. వాటిని లెక్కించకుండా కోర్టు ఆదేశాలతో ఫలితాన్ని (GHMC Election 2020 Results) నిలిపివేశారు. అప్పటికే టీఆర్ఎస్ అభ్య‌ర్థి 504 ఓట్ల మెజార్టీతో ముందంజ‌లో ఉన్నారు. తాజాగా హైకోర్టు ఆదేశాలతో ఇత‌ర గుర్తులున్న 544 ఓట్లను లెక్కించి అధికారులు ఫలితాన్ని ప్రకటించారు. Also read: GHMC: వరద సాయం కోసం మీ సేవా సెంటర్లకు వెళ్లొద్దు: కమిషనర్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

సోషల్ మీడియాలో జీ హిందుస్థాన్ పేజీలను సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News