GHMC: వరద సాయం కోసం మీ సేవా సెంటర్లకు వెళ్లొద్దు: కమిషనర్

అక్టోబరులో కురిసిన భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం (Hyderabad Rains) అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నష్టపోయిన బాధితులకు అండగా నిలిచేందుకు ఒక్కో కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ( Telangana Govt ) రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని ప్రకటించి చాలా మందికి అందించింది.

Last Updated : Dec 7, 2020, 12:31 PM IST
GHMC: వరద సాయం కోసం మీ సేవా సెంటర్లకు వెళ్లొద్దు: కమిషనర్

Hyderabad floods relief fund: హైదరాబాద్‌: అక్టోబరులో కురిసిన భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం ( Hyderabad Rains ) అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నష్టపోయిన బాధితులకు అండగా నిలిచేందుకు ఒక్కో కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ( Telangana Govt ) రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని ప్రకటించి చాలా మందికి అందించింది. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో వరద సాయానికి ( flood relief ) బ్రేక్ పడగా.. డిసెంబరు 7నుంచి వరద సాయాన్ని అందిస్తామని ప్రభుత్వం తెలిపింది.

ఈ క్రమంలో సోమవారం ఉదయం నుంచి వరద సహాయం ప్రక్రియ మళ్లీ ప్రారంభమైంది. దీంతో సాయం అందని కుటుంబాలు మీ సేవ దగ్గరకు తరలివస్తున్నాయి. ఈ సందర్భంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ లోకేష్‌ కుమార్ (ghmc commissioner lokesh kumar) కీలక ప్రకటన చేశారు. వరద సాయం కోసం బాధితులు మీ సేవ సెంటర్లు వెళ్లాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. Also read: Benefits of Egg: రోజూ ‘గుడ్డు’ తింటే ఎన్ని లాభాలో తెలుసా?

జీహెచ్ఎంసీ ( GHMC ) సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి ఇంకా వరదసాయం అందని కుటుంబాల వివరాలను సేకరిస్తున్నాయని పేర్కొన్నారు. బాధితుల వివరాలు, ఆధార్ నెంబర్ ధ్రువీకరణ జరుగుతోందని తెలిపారు. తర్వాత వారి అకౌంట్‌లోనే నేరుగా వరద సాయం డబ్బులు జమ అవుతాయని పేర్కొన్నారు.

Also read: Shraddha Das: ఫొటోలతో హీటెక్కిస్తున్న శ్రద్ధా దాస్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

సోషల్ మీడియాలో జీ హిందుస్థాన్ పేజీలను సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News