హైదరాబాద్ ఎయిర్ పోర్టు రన్‌వేకి కొత్త టెక్నాలజీ

జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ పోర్టు లిమిటెడ్ ఆధ్వర్యంలో నడుస్తున్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు మెయిన్ రన్ వే (09/27) పేవ్‌మెంట్ పరిరక్షణ కోసం కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తోంది.

Last Updated : Jun 22, 2018, 08:13 PM IST
హైదరాబాద్ ఎయిర్ పోర్టు రన్‌వేకి కొత్త టెక్నాలజీ

జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ పోర్టు లిమిటెడ్ ఆధ్వర్యంలో నడుస్తున్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు మెయిన్ రన్ వే (09/27) పేవ్‌మెంట్ పరిరక్షణ కోసం కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందుకు సంబంధించిన మొదటి దశ పనులు పూర్తయ్యాయి. ఎయిర్ పోర్టు స్టీల్ గార్డ్ పేరుతో అందుబాటులోకి వస్తున్న ఈ కొత్త టెక్నాలజీ వలన పేవ్‌మెంట్ ఎక్కువకాలం మన్నికతో ఉంటుంది.

ముంబయి వెండర్ల ద్వారా ఈ టెక్నాలజీ అమెరికన్ కంపెనీ చేయూతతో ఎయిర్ పోర్టుకి అందనుంది. ఈ కొత్త టెక్నాలజీ వలన 3 నెలల కాలం పట్టే రన్ వే పరిరక్షణ పనులు కేవలం 15 రోజులలోనే పూర్తి చేయవచ్చు. ఈ కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తున్న సందర్భంగా జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ పోర్టు లిమిటెడ్ సీఈఓ ఎస్‌జీకే కిషోర్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. తమ ఆపరేషన్స్ అత్యుత్తమ స్థాయిలో నడిచేందుకు కొత్త సాంకేతిక పనులకు శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. 

ఎయిర్ పోర్ట్ రన్ వే కోసం కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తున్నప్పుడు.. విమాన ఆపరేషన్స్ కోసం ఎటువంటి అంతరాయం కూడా కలగకుండా తమ సెకండరీ రన్ వే తోడ్పాటునిచ్చిందని  సీఈఓ అన్నారు. ఇటీవలి కాలంలో పలు ఎయిర్ క్రాఫ్టులు రన్ వే సవ్యంగా ఉండకపోవడం టైర్ బరస్ట్ లాంటి సమస్యలు ఎదుర్కొన్నాయని.. అందుకోసం ప్రత్యమ్నాయ పరిష్కారాలను అన్వేషించాలని తాము భావించామని.. ఈ క్రమంలోనే కొత్త టెక్నాలజీని తాము అందుబాటులోకి తీసుకురావాలని యోచించామని ఆయన అన్నారు. 

ఎయిర్ ఫీల్డ్ పేవ్‌మెంట్లు సాధారణంగా ఎయిర్ ట్రాఫిక్, ఇంధనం లీకేజీ, వాతావరణ అలజడులు, జెస్ట్ బ్లాస్టింగ్ మొదలైన కారణాల వల్ల తక్కువ కాలంలోనే మరమ్మత్తులకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఎయిర్ పోర్టు స్టీల్ గార్డ్ పద్ధతి ద్వారా తక్కువ ఖర్చుతోనే పేవ్ మెంట్ పరిరక్షణ కోసం తాము సిద్ధమయ్యామని సీఈఓ ఓ ప్రకటనలో తెలిపారు. 

Trending News