Traffic Jam : నేషనల్ హైవే పై భారీగా ట్రాఫిక్ జామ్.. ఆ ప్రాంతంలో నిలిచిపోయిన వాహనాలు

 National Highway Traffic Jam : నగరంలో భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా పలు రహదారులపై వాహనాలు కిలోమీటర్ల తరబడి ట్రాఫిక్ జాంలో ఇరుక్కుపోయాయి. ప్రధానంగా సుచిత్ర జంక్షన్, రాజీవ్ రహదారిపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు చిక్కుల్లో పడ్డారు.  

Written by - Bhoomi | Last Updated : Aug 21, 2024, 12:34 PM IST
 Traffic Jam : నేషనల్ హైవే పై భారీగా ట్రాఫిక్ జామ్.. ఆ ప్రాంతంలో నిలిచిపోయిన వాహనాలు

 National Highway Traffic Jam : ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. అస్తవ్యస్తంగా మారిన జనజీవనంపై బుధవారం వరుణుడు మళ్లీ ఉగ్రరూపం చూపాడు. నేడు తెల్లవారుజామున హైదరాబాద్ సహా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసింది. దీంతో ఎక్కడికక్కడ రహదారులపై  ట్రాఫిక్ జామ్ ఏర్పడి  వాహనాలు నిలిచిపోయాయి.  గంటల తరబడి వాహనాలు  ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్నాయి. వర్షానికి తోడు నేడు  వివాహ ముహూర్తాలు కూడా ఉండటంతో  పెద్ద ఎత్తున రహదారులన్నీ కూడా వాహనాలతో నిండిపోయాయి. ముఖ్యంగా నగరంలోని కీలక జంక్షన్లు అయిన  మాదాపూర్,  గచ్చిబౌలి,  అమీర్ పేట,  కూకట్ పల్లి,  సుచిత్ర జంక్షన్  వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయి గంటల తరబడి  రోడ్లపై నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌, షేక్‌పేట్‌, దర్గా, టోలిచౌకి, రాయదుర్గంలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా ఖైరతాబాద్‌ మండలంలో 12.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే శేరిలింగంపల్లి, చందానగర్‌, మియాపూర్‌లో భారీ వర్షం నమోదు అయ్యింది. పంజాగుట్ట, అమీర్‌పేట్‌, బేగంపేట, ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్‌ సమీపంలో భారీగా వరదనీరు చేరుకోవడంతో వాహనదారులు  ఇబ్బందులు పడుతున్నారు.

Also Read : Nita Ambani Gift: నీతా అంబానీకి చిన్న కోడలు అంటేనే ఇష్టమా..పెద్ద కోడలు కన్నా చిన్నకోడలికే.. అత్యంత ఖరీదైన గిఫ్ట్  

నగరంలోని సుచిత్ర జంక్షన్ రాజీవ్ రహదారిపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు గంటల తరబడి తమ వాహనాలతో రోడ్లపై నిలిచి ట్రాఫిక్ ఎప్పుడు క్లియర్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. 2 గంటలపాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి గ్రేటర్‌ హైదరాబాద్‌ అతలాకుతలం అయ్యింది. భారీగా వరద నీరు చేరి రహదారులు చెరువులను తలపించాయి. మ్యాన్‌హోల్స్‌ పొంగిపొర్లాయి. వర్షపు నీరు నిలిచి భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. పంజాగుట్ట సుఖ్‌నివాస్‌ అపార్ట్‌మెంట్‌ వద్ద పిడుగుపడి కారు ధ్వంసం అయ్యింది. అలాగే  ఎల్బీ స్టేడియం ప్రహరీ గోడ కూలడంతో పోలీస్‌ వాహనం ధ్వంసం అయ్యింది. 

అయితే  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీచేశారు. ఇదిలా ఉంటే రాబోయే ఐదు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 24 వరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేస్తూ హెచ్చరించింది. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, వికారాబాద్‌, నారాయణపేట, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.

Also Read : Ambani-Adani: అంబానీ పవర్‎..అదానీ చేతుల్లోకి..ఏకంగా వేల కోట్లకు డీల్

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x