'గులాబీ కూలీ' విషయంలో తెలంగాణ ఏసీబీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 'గులాబీ కూలీ' పేరిట వివిధ సంస్థలు, పరిశ్రమల వద్ద నుంచి మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు బలవంతంగా లక్షలు వసూలు చేస్తున్నారని..ఏసీబీకి టి.కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆగస్టు 31న ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటి వరకు ఏసీబీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆయన..ఈ వ్యవహారాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రేవంత్ వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం.. ఈ మేరకు ఏసీబీకి నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను.. ఇప్పటివరకూ జరిగిన విచారణ నివేదికను డిసెంబర్ 13న సమర్పించాలని ఏసీబీని హైకోర్టు ఆదేశించింది.దీంతో తెలంగాణ సర్కార్ ఇబ్బందుల్లో పడింది. దీనిపై ఎలా స్పందించాలని ఇటు ఏసీబీ..అటు ప్రభుత్వ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు.