ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య

చిలకలగూడలో నారాయణ అనే ఓ 22 ఏళ్ల యువకుడు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం సృష్టించింది. ఇరుగుపొరుగు వారు అందించిన సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న చిలకలగూడ పోలీసులు.. ఘటన స్థలాన్ని పరిశీలించారు.

Last Updated : Apr 25, 2020, 02:24 PM IST
ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య

హైదరాబాద్: చిలకలగూడలో నారాయణ అనే ఓ 22 ఏళ్ల యువకుడు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం సృష్టించింది. ఇరుగుపొరుగు వారు అందించిన సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న చిలకలగూడ పోలీసులు.. ఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం గల్లిజరుగుల గ్రామం నారాయణ స్వస్థలం. బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చిన నారాయణ.. గచ్చిబౌలిలోని ఓ హోటల్‌లో పని చేస్తున్నాడు. కరోనా వైరస్ నియంత్రణ కోసం లాక్ డౌన్ విధించినప్పటి నుంచి తాత్కాలికంగా హోటల్ మూతపడటంతో అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్నాడని ఇరుగుపొరుగు వారు చెబుతున్నారు. 

Also read : లాక్ డౌన్ పరిమితి సడలింపు..!!

స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం ఆర్థిక ఇబ్బందులే అతని ఆత్మహత్యకు కారణమని చెబుతున్న పోలీసులు.. అతడి ఆత్మహత్యకు మరేదైనా కారణం ఉండి ఉంటుందా అనే కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News