'కరోనా వైరస్' వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో ప్రపంచమే లాక్ డౌన్ పరిధిలోకి వెళ్లిపోయింది. ఏ దేశం చూసినా.. ఏ ప్రాంతం చూసినా .. అంతటా లాక్ డౌన్ మాత్రమే కనిపిస్తోంది. కరోనా పుణ్యమా.. అని అన్నీ మూతపడే ఉన్నాయి. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణం లేదు. ఎక్కడి వాళ్లు అక్కడే ఉండాలి.
పెళ్లి లేదు పేరంటం లేదు అన్నట్లుగా ఉంది పరిస్థితి. చిన్న చిన్న ఫంక్షన్లు కూడా చేసుకోలేని పరిస్థితి నెలకొంది. లాక్ డౌన్ వేళ అమెరికాలో ఉంటున్న ఓ తెలంగాణ తల్లిదండ్రులకు ..ఇలాంటి సమస్యే ఎదురైంది. తమ చిన్నారి మొదటి పుట్టిన రోజును జరుపుకోవాల్సి వచ్చింది. ఐతే లాక్ డౌన్ కారణంగా వారు ఇక్కడకు(స్వదేశానికి) రాలేరు. పైగా ఎవరినీ పిలిచి హైదరాబాద్ లో ఉంటున్న చిన్నారి తొలి పుట్టిన రోజును నిర్వహించలేరు.
ఈక్రమంలో తెలంగాణ పోలీసుల సాయం తీసుకున్నారు. తమ చిన్నారి మైరా తొలి పుట్టిన రోజు నిర్వహించాల్సిందిగా కోరారు. ఐతే దీనికి తెలంగాణ పోలీసులు సానుకూలంగా స్పందించారు. చిన్నారి మైరా ఇంటికి వెళ్లి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడమే కాదు. కేక్ కూడా కట్ చేయించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజన్ కుమార్ యాదవ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు.
మరోవైపు చిన్నారి తల్లిదండ్రులు, అమ్మమ్మ,తాత, నానమ్మ, తాత హర్షం వ్యక్తంచేశారు. తెలంగాణ పోలీసులకు హ్యాట్సాఫ్ చెప్పారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
హ్యాట్సాఫ్ తెలంగాణ పోలీస్..!!