Hyderabad Press Club Elections: హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు.. 'ఫ్రెండ్స్ ప్యానెల్' మేనిఫెస్టో

Hyderabad Press Club Elections: హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ ఎన్నికల్లో మూడు ప్యానెళ్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. మార్చి 13, ఆదివారం జరుగుతున్న ఎన్నికల్లో ఫ్రెండ్స్‌ ప్యానల్‌ తరపున పూర్తిస్థాయిలో పదవులకు పలువురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అధ్యక్ష పదవికి వేణుగోపాల్ నాయుడు, ఉపాధ్యక్ష పదవులకు శ్రీకాంత్‌ రావు, సి.వనజ, ప్రధాన కార్యదర్శి పదవికి రవికాంత్‌ రెడ్డి పోటీ పడుతున్నారు.

Last Updated : Mar 12, 2022, 10:18 PM IST
  • హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో హోరాహోరీగా పోటీ
  • ఎన్నికల్లో విజయం కోసం ప్రచారంలో తలమునకలైన అభ్యర్థులు
  • ఫ్రెండ్స్ ప్యానెల్ అభ్యర్థుల జాబితా, మేనిఫెస్టో వివరాలు
Hyderabad Press Club Elections: హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు.. 'ఫ్రెండ్స్ ప్యానెల్' మేనిఫెస్టో

Hyderabad Press Club Elections: హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ ఎన్నికల్లో మూడు ప్యానెళ్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. మార్చి 13, ఆదివారం జరుగుతున్న ఎన్నికల్లో ఫ్రెండ్స్‌ ప్యానల్‌ తరపున పూర్తిస్థాయిలో పదవులకు పలువురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అధ్యక్ష పదవికి వేణుగోపాల్ నాయుడు, ఉపాధ్యక్ష పదవులకు శ్రీకాంత్‌ రావు, సి.వనజ, ప్రధాన కార్యదర్శి పదవికి రవికాంత్‌ రెడ్డి పోటీ పడుతున్నారు. అలాగే, జాయింట్‌ సెక్రెటరీలుగా రమేష్ వైట్ల, చిలుకూరి హరిప్రసాద్, కోశాధికారిగా ఎ.రాజేష్‌ పోటీలో ఉన్నారు. ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులుగా పద్మావతి, అబ్దుల్‌, ఆంజనేయులు, రాజేశ్వరి కల్యాణం, బాలకృష్ణ, వసంత్‌ కుమార్‌, గుజ్జుల రాజేష్‌, శ్రీనివాస్‌ రెడ్డి, ఉమాదేవి, శంకర్‌ గౌడ్‌ శిగ పోటీలో ఉన్నారు.

ఇక, ఫ్రెండ్స్‌ ప్యానల్‌ ఎజెండా చూస్తే ప్రెస్‌క్లబ్‌ను జర్నలిస్టు కుటుంబాల కోసం రిక్రియేషన్‌ సెంటర్‌, లిటరరీ, కల్చరల్‌ సెంటర్‌గా మారుస్తామని చెబుతున్నారు. ఉదయం నుంచి రాత్రి దాకా నిరంతరాయంగా క్యాంటీన్‌ నడిపిస్తామని, సబ్సిడీ ధరల్లోనే టీ, టిఫిన్లు, మధ్యాహ్న భోజనం అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇస్తున్నారు. మహిళా జర్నలిస్టులు, వయోధిక జర్నలిస్టుల వార్షిక సభ్యత్వ రుసుములో 50 శాతం రాయితీ ఇస్తామని అంటున్నారు. జర్నలిస్టుల పిల్లల మెరిట్‌ స్కాలర్‌షిప్‌ 5వేల రూపాయలకు పెంచుతామని, ప్రతీ వారం ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌లో సెలబ్రేషన్లు నిర్వహిస్తామని, జర్నలిస్టుల (Journalists families) కుటుంబాలతో ప్రతియేటా స్పోర్ట్స్‌ డే నిర్వహిస్తామని హామీలు ఇస్తున్నారు.

Also read: Hyderabad Press Club Elections: హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు.. 'మన ప్యానెల్' మేనిఫెస్టో

Also read : Rasamayi Balakishan: ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​కు అసెంబ్లీలో చేదు అనుభవం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News