Hyderabad Press Club Elections: హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా దూసుకుపోతోంది మన ప్యానెల్. సీనియర్ జర్నలిస్ట్ సూరజ్ భరద్వాజ్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీచేస్తోన్న మన ప్యానెల్ పారదర్శకతే మా నినాదం అంటోంది. పరివర్తన, నమ్మకం దిశగా కృషిచేస్తామని చెబుతోంది. ఈ ప్యానెల్ నుంచి షరీఫ్ మొహమ్మద్, దేవికారాణి వైస్ ప్రెసిడెంట్ పదవుల కోసం పోటీ పడుతున్నారు. జనరల్ సెక్రటరీ పోస్టు కోసం కే జాన్సన్, జాయింట్ సెక్రటరీ-1 పదవికోసం ఎంవీవీ సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ-2 కోసం తిరుపతి చారి, ట్రెజరర్‌గా మారెం శ్రీనివాస్ బరిలో ఉన్నారు. ఇక ఈసీ మెంబర్లుగా సుమబాల, రమాదేవి, అమిత్ భట్టు, బాపూరావు, బోండ వెంకట ప్రసాద్, చంద్రశేఖర్, కొండా శ్రీనివాస్, కార్టూనిస్ట్ నారు, రాము నేత, శ్రీనివాస్ తిగుళ్ల పోటీ చేస్తున్నారు.
ప్రెస్ క్లబ్ ఎన్నికల కోసం మన ప్యానెల్ ఆకర్షనీయమైన మేనిఫెస్టో రిలీజ్ చేసింది. మహిళా జర్నలిస్టుల సౌకర్యాలకు పెద్ద పీట వేసింది. ప్యానెల్ గెలిస్తే మహిళా జర్నలిస్టుల కోసం విడిగా రూములు కేటాయిస్తామని హామీ ఇచ్చింది. టీంలో మహిళల సంఖ్య పెంచడంతో పాటు.. మహిళలకు ప్రత్యేక వాష్ రూంలు ఏర్పాటు చేస్తామని తెలిపింది. కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కొత్త మెంబర్‌షిప్‌లపై కూడా మన ప్యానెల్ స్పష్టత ఇచ్చింది. జనరల్ బాడీ ఆమోదంతో కొత్త మెంబర్‌షిప్‌లకు వెంటనే ఆమోదం తెలపడంతో పాటు స్పెషల్ నోటిఫికేషన్‌తో మరింత మందికి అవకాశం కల్పిస్తామంది. కొత్త మెంబర్ల కోసం మూడు సంతకాల సేకరణ అంశాన్ని తొలగిస్తామని హామీ ఇచ్చింది.
ప్రెస్ క్లబ్ సభ్యులకు బీమా పథకంతో పాటు సభ్యుల కుటుంబసభ్యులకు కూడా హెల్త్ చెకప్, ట్రీట్‌మెంట్ కోసం కార్పొరేట్ సంస్థలు, ఆసుపత్రులతో టైఅప్ అవుతామంది. ప్రెస్ క్లబ్‌ను రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్‌తో అనుసంధానం చేస్తామని.. బై లాస్‌ను విస్తృత పరిచి, మరింత స్పష్టత తెచ్చేందుకు సీనియర్లతో కమిటీ ఏర్పాటు చేస్తామంది. ప్రెస్‌క్లబ్ కొత్త బిల్డింగ్ నిర్మాణం కోసం వీలైనంత త్వరగా శంకుస్థాపన చేస్తామని మానిఫెస్టోలో వివరించింది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన లాన్ అండ్ ఓపెన్ ఎయిర్ థియేటర్లో వీకెండ్ ఎంటర్టైన్‌మెంట్‌కు శ్రీకారం చుడతామని చెప్పింది. స్వచ్ఛ ప్రెస్ క్లబ్ లక్ష్య సాధన కోసం కృషిచేస్తామంది.
ప్రెస్ క్లబ్ నిర్వహణలో పారదర్శకత, ఫీడ్‌బ్యాక్ మెకానిజం ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చింది. క్రీడా సదుపాయాలను కల్పించి.. తరచూ క్రీడా కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పింది. ప్రెస్ క్లబ్ అవార్డుల ప్రకటనతో పాటు డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూంలు ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో తెలిపింది. ఫండ్ రైజింగ్ కోసం కార్యక్రమాల నిర్వహణతో పాటు ప్రెస్‌క్లబ్ అభివృద్ధి కార్యక్రమాలు, ఫుడ్‌మెనూ సవరణల కోసం కమిటీలు ఏర్పాటు చేస్తామంది. మొత్తంగా మన ప్యానెల్- మన ప్రెస్ క్లబ్ (Mana panel - Mana press club) అంటూ ఎన్నికల్లో పోటీ పడుతోంది.
Also read : Crime News: థర్డ్ డిగ్రీ ప్రయోగించిన బయ్యారం ఎస్సై రమాదేవి.. నడవలేని స్థితిలో నిందితుడు!!
Also read : Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ప్రముఖుల బాగోతాలు బయటపడతాయంటున్న రేవంత్ రెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook