Koppula Eshwer: ప్రగతి భవన్ లో దళిత మంత్రికి ఘోర అవమానం.. తన పక్కన కూర్చోనివ్వని కేసీఆర్?

Koppula Eeshwer: ప్రగతి భవన్ లో జరిగిన ఓ ఘటనతో కేసీఆర్ దళిత నేతను అవమానించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎమ్మెల్యే బేరసారాలకు సంబంధించిప్రగతి భవన్ లో ప్రెస్ మీట్ పెట్టారు కేసీఆర్. ఈ సందర్భంగానే సీనియర్ నేత, దళిత మంత్రి కొప్పుల ఈశ్వర్ కు ఘోర అవమానం జరిగింది.

Written by - Srisailam | Last Updated : Nov 4, 2022, 11:44 AM IST
  • కేసీఆర్ ప్రెస్ మీట్ లో మంత్రుల కొప్పులకు అవమానం?
  • కొప్పులను తన పక్క నుంచి పంపించివేసిన కేసీఆర్
  • దళిత నేతను కేసీఆర్ అవమానించారనే ఆరోపణలు
Koppula Eshwer: ప్రగతి భవన్ లో దళిత మంత్రికి ఘోర అవమానం.. తన పక్కన కూర్చోనివ్వని కేసీఆర్?

Koppula Eshwer:   తెలంగాణ ప్రభుత్వంలో దళిత నేతలకు గౌరవం లేదా? ముఖ్యమంత్రి కేసీఆర్ కు దళిత నేతలంటే చిన్నచూపా? అంటే విపక్షాలు అవుననే అంటున్నాయి. మొదటి నుంచి దళిత నేతలను కేసీఆర్ పట్టింకోరని, రాజకీయ ప్రయోజనాల కోసమే వాళ్లకు ప్రాధాన్యత ఇచ్చినట్లు కవరింగ్ ఇస్తారని విపక్షాలు ఆరోపిస్తుంటాయి. తాజాగా ప్రగతి భవన్ లో జరిగిన ఓ ఘటనతో కేసీఆర్ దళిత నేతను అవమానించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎమ్మెల్యే బేరసారాలకు సంబంధించి గురువారం రాత్రి ప్రగతి భవన్ లో ప్రెస్ మీట్ పెట్టారు కేసీఆర్. ఈ సందర్భంగానే సీనియర్ నేత, దళిత మంత్రి కొప్పుల ఈశ్వర్ కు ఘోర అవమానం జరిగింది. ప్రగతి భవన్ లో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సీఎం కేసీఆర్ కంటే ముందుగానే ప్రగతి భవన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ కు వచ్చిన కొప్పుల.. ముఖ్యమంత్రి సీటు పక్కనే కూర్చున్నారు. అయితే  మీడియా ముందుకు వచ్చిన కేసీఆర్.. కొప్పుల నుంచి అక్కడి నుంచి పంపించే వేశారు. ఇక్కడి నుంచి వెళ్లు ఒక్కసారి చెబితే అర్ధం కాదా అంటూ కొప్పులను ఉద్దేశించి కేసీఆర్ అన్న మాటలు బయటికి వినిపించాయి. కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో  ఆ  సీటులో నుంచి లేచి దూరంగా వెళ్లిపోయారు ఈశ్వర్. కేసీఆర్ పక్కన కూర్చున్న కొప్పుల.. అక్కడి నుంచి వెళ్లి దూరంగా కూర్చున్నారు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కొప్పుల ఈశ్వర్ టీఆర్ఎస్ లో అత్యంత సీనియర్. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెంటే ఉన్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం కేసీఆర్ కేబినెట్ లో ఏకైక దళిత మంత్రి. అలాంటి నేతలను కుర్చిలో నుంచి లేపి పక్కకు పంపించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కేసీఆర్ కు మొదటి నుంచి దళిత నేతలంతే చిన్నచూపని.. ప్రగతి భవన్ వేదికగా మరోసారి స్పష్టమైందని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో చాలా మంది దళిత నేతలను కేసీఆర్ దారుణంగా అవమానించారని మండిపడ్డారు. కొప్పుల ఈశ్వర్ లాంటి సీనియర్ నేతను చేయి పట్టుకుని పక్కకు లాగేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు దళిత నేతలు. ప్రగతి భవన్ లో జరిగిన ఘటనపై దళిత సంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ప్రగతి భవన్ లో దళిత నేతలకు నిత్యం అవమానాలు జరుగుతూనే ఉంటాయని... అయినా పదవుల కోసం బానిసలుగా కొందరు ఉంటున్నారని మండిపడుతున్నారు.

మరోవైపు తనకు సంబంధించి వైరల్ గా మారిన వీడియోపై స్పందించారు మంత్రి కొప్పుల ఈశ్వర్. టీఆర్ఎస్ కుటుంబానికి కేసీఆర్ తండ్రి లాంటి వారని..తనను ఎప్పుడు చిన్నచూపు చూడలేదని చెప్పారు. తండ్రి హోదాలో మంత్రులను ఒక వైపు.. ఎమ్మెల్యేలను ఓ వైపు కూర్చోవాలని చెప్పారన్నారు. ఎమ్మెల్యే వరుసలో తనను మంత్రుల వైపు రావాల్సిందిగా ముఖ్యమంత్రి కోరారన్నారు కొప్పుల. ఈ విషయంపై బిజెపి, కాంగ్రెస్ పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని.. దళిత సమాజానికి అవమానం జరిగినట్లుగా చిత్రికరిస్తున్నాయని ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News