Minister KTR responds to Lyricisit Kandikonda Daughters appeal: తీవ్ర అనారోగ్యానికి గురై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సినీ గేయ రచయిత కందికొండ (Kandikonda) కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఆర్థిక సమస్యల కారణంగా ప్రస్తుతం ఉన్న అద్దె ఇంటిని కూడా ఈ నెలఖారుకు ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో చిత్రపురి కాలనీలో ఇంటిని కేటాయించాలని మంత్రి కేటీఆర్‌కు (KTR) కందికొండ కుమార్తె మాతృక ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు.
మాతృక విజ్ఞప్తిపై మంత్రి కేటీఆర్ (Minister KTR) సానుకూలంగా స్పందించారు. 'తప్పకుండా మాతృక... మీ కుటుంబానికి మేము గతంలోనూ అండగా నిలిచాం... ఇప్పుడు కూడా అండగా ఉంటాం.' అని స్పష్టం చేశారు. ఇంటి విషయమై ఆమె చేసిన విజ్ఞప్తిని తన కార్యాలయ ప్రతినిధులు చూసుకుంటారని పేర్కొన్నారు.
గేయ రచయిత కందికొండ (Lyricist Kandikonda) కొన్నేళ్ల క్రితం క్యాన్సర్ (Cancer) బారినపడిన సంగతి తెలిసిందే. క్యాన్సర్ నుంచి కోలుకున్నప్పటికీ.. రేడియేషన్ ఎఫెక్ట్ కారణంగా ఆయన వెన్నెముక దెబ్బతిన్నది. దీంతో పలుమార్లు ఆయనకు వెన్నెముక సర్జరీలు నిర్వహించారు. ఇందుకోసం ప్రభుత్వం కూడా కొంత ఆర్థిక సాయం అందించింది. ఇప్పుడిప్పుడే కందికొండ అనారోగ్యం నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో కందికొండ కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది.
Also Read: రొమాంటిక్ డేట్‌కు వెళ్లిన సారా టెండూల్కర్.. ఇంతకు ఆమె చేయి పట్టుకుంది ఎవరు?
ప్రస్తుతం కందికొండ కుటుంబం ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకి ఉంటున్నారు. ఈ నెలాఖరు వరకు ఆ ఫ్లాట్‌ను ఖాళీ చేయాల్సి ఉంది. ఆ ఇంటిని ఖాళీ చేస్తే ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి. ఓవైపు క్యాన్సర్‌తో (Cancer) బాధపడుతున్నప్పటికీ.. సొంతింటి కోసం కందికొండ ప్రయత్నాలు చేశారు. చిత్రపురి కాలనీలో సినీ కార్మికుల కోసం నిర్మించిన అపార్ట్‌మెంట్స్‌లో ఫ్లాట్ కోసం 2012లో 'ఏపీ సినీ వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ'కి రూ.4,05,000 చెల్లించారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా చివరి వాయిదా డబ్బులు చెల్లించకపోవడంతో ఆయనకు ఇల్లు కేటాయించలేదు. ఇదే విషయాన్ని తాజాగా కందికొండ కుమార్తె మాతృక మంత్రి కేటీఆర్ (Minister KTR) దృష్టికి తీసుకెళ్లారు. తమకు చిత్రపురి కాలనీలో లేదా మరెక్కడైనా ఇల్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో సంప్రదించి అవసరమైన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
Sure Mathruka. We have stood by your family in the past and will do now too
My team @KTRoffice will coordinate with Minister @YadavTalasani office asap https://t.co/5cI7XvX5h3
— KTR (@KTRTRS) December 5, 2021
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook