MLA Lasya Nanditha Car Accident: ఎమ్మెల్యే లాస్య నందిత మరణానికి కారణాలు ఇవే.. ఆ పొరపాటు చేయకుండా ఉంటే..!

MLA Lasya Nanditha Death News Live Updates: ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండు ప్రమాదాల నుంచి బయటపడిన లాస్య నందిత.. మూడో ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆమె మరణంతో కంటోన్మెంట్ నియోజకవర్గంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.    

Written by - Ashok Krindinti | Last Updated : Feb 23, 2024, 05:20 PM IST
MLA Lasya Nanditha Car Accident: ఎమ్మెల్యే లాస్య నందిత మరణానికి కారణాలు ఇవే.. ఆ పొరపాటు చేయకుండా ఉంటే..!
Live Blog

MLA Lasya Nanditha Death News Live Updates: ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో బీఆర్ఎస్ శ్రేణులతోపాటు కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సరిగ్గా ఏడాది క్రితం ఎమ్మెల్యే సాయన్న అనారోగ్యంతో కన్నుమూయగా.. ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో ఆయన కుమార్తె లాస్య నందిత ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని మిగిల్చింది. శుక్రవారం తెల్లవారజామున మేడ్చల్ నుంచి కారులో వస్తుండగా.. పటాన్‌చెరు సమీపంలోని సుల్తాన్‌పూర్ ఓఆర్ఆర్‌పై అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే లాస్య నందిత ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. కారు డ్రైవర్, పీఏ తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యే లాస్య నందితపై మృతికి రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. 
 

23 February, 2024

  • 17:19 PM

    MLA Lasya Nanditha Death News Live Updates: బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత భౌతిక కాయానికి సీఎం రేవంత్‌రెడ్డి నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు పొన్నం ప్రభాకర్‌, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్‌బాబు ఉన్నారు.
     

  • 15:20 PM

    MLA Lasya Nanditha Death News Live Updates: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎమ్మెల్యే లాస్య నందిత పోస్ట్‌మార్టం రిపోర్టులో డాక్టర్లు సంచలన విషయాలు వెల్లడించారు. తలకు బలమైన గాయాలు కావడం వల్లే లాస్య అక్కడికక్కడే చనిపోయారని తెలిపారు. ఆమె శరీరంలోని ఎముకలు పూర్తిగా దెబ్బ తిన్నాయని.. తై బోన్, రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యాయని పేర్కొన్నారు. ఆరు దంతాలు ఊడిపోయాయని.. ఒక కాలు పూర్తిగా విరిగిపోయిందన్నారు. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే ప్రమాదంలో మరణించారని తెలిపారు.
     

  • 14:07 PM
  • 10:59 AM

    MLA Lasya Nanditha Death News Live Updates: ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎమ్మెల్యే మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ అతివేగం, నిద్రమత్తు ప్రమాదానికి కారణామని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఘటన స్థలంలో ప్రమాదం తీరును పరిశీలిస్తున్నారు.

  • 10:55 AM

  • 10:46 AM
  • 10:37 AM

    MLA Lasya Nanditha Death News Live Updates: "కంటోన్మెంట్ శాసన సభ్యురాలు లాస్య నందిత అకాలమరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. నందిత తండ్రి స్వర్గీయ సాయన్న గారితో నాకు సన్నిహిత సంబంధం ఉండేది. ఆయన గత ఏడాది ఇదే నెలలో స్వర్గస్తులవడం… ఇదే నెలలో నందిత కూడా ఆకస్మికంగా మరణం చెందడం అత్యంత విషాదకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ… ఆమె ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.." అని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

  • 10:23 AM

    MLA Lasya Nanditha Death News Live Updates: కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. అతిపిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రజామన్ననలు పొందిన లాస్య నందిత  రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమని తన విచారం వ్యక్తం చేశారు. కష్టకాలంలో వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

     

  • 10:21 AM
  • 10:13 AM

    MLA Lasya Nanditha Death News Live Updates: ఎమ్మెల్యే లాస్య నందిత మరణానికి నిపుణులు 3 ప్రధాన కారణాలు చెబుతున్నారు. సేఫ్టీ రేటింగ్ తక్కువగా ఉన్న మారుతీ సుజుకీ XL6 కారులో ప్రయాణం ఒక కారణంగా భావిస్తున్నారు. మిడిల్ సీటులో కూర్చున్న నందిత.. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో ముందు సీటుకు వేగంగా ఢీకొట్టడంతో ఇంటర్నల్ పార్ట్స్ డ్యామేజ్ కావడం మరో కారణమని అంటున్నారు. 10 రోజుల క్రితం ఆమె స్కార్పియోలో వెళ్తూ ప్రమాదానికి గురవ్వగా.. అప్పుడు డ్రైవర్‌ను మార్చినా నందిత బతికేవారని చెబుతున్నారు. డ్రైవర్ అతివేగం, నిద్రమత్తు ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. 
     

Trending News