Look out Notice: సుజనాకు చుక్కెదురు..అమెరికాకు వెళ్లకుండా అడ్డుకున్న అధికారులు

బీజేపీ రాజ్యసభ సభ్యుడు , మాజీ టీడీపీ నేత సుజనా చౌదరికి చుక్కెదురైంది. అమెరికాకు బయలుదేరిన అతన్ని..ఢిల్లీ ఎయిర్ పోర్టులో అడ్డుకున్నారు. లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. చేసేది లేక తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. 

Last Updated : Nov 13, 2020, 10:10 PM IST
  • బ్యాంకు రుణాల ఎగవేత కేసులో సుజనా చౌదరికి లుక్ అవుట్ నోటీసులు
  • సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 522 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 4 వందల కోట్ల ఎగవేత
  • అమెరికా వెళ్తుండగా ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు
Look out Notice: సుజనాకు చుక్కెదురు..అమెరికాకు వెళ్లకుండా అడ్డుకున్న అధికారులు

బీజేపీ ( BJP ) రాజ్యసభ సభ్యుడు , మాజీ టీడీపీ నేత సుజనా చౌదరికి చుక్కెదురైంది. అమెరికాకు బయలుదేరిన అతన్ని..ఢిల్లీ ఎయిర్ పోర్టులో అడ్డుకున్నారు. లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. చేసేది లేక తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. 

తెలుగుదేశం పార్టీ ( Telugu Desam ) నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ( Sujana Chowdary ) కి అధికారులు షాక్ ఇచ్చారు. బ్యాంకు రుణాల కుంభకోణం కేసులో లుక్ అవుట్ నోటీసులు ( Look out notices ) జారీ అయ్యాయి. లుక్ అవుట్ నోటీసుల ఆధారంగా..అమెరికాకు బయలుదేరిన సుజనా చౌదరిని ఢిల్లీ ఎయిర్ పోర్టు ( Delhi Airport ) లో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకుని వెనక్కి పంపించారు. దాంతో లుక్ అవుట్ నోటీసులపై తను అక్రమంగా అడ్డుకున్నారంటూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు సుజనా చౌదరి.  లుక్ అవుట్ నోటీసుల్ని రద్దు చేయాలని పిటీషన్ దాఖలు చేశారు. 

సుజనా చౌదరి ( Sujana Chowdary )పై వివిధ బ్యాంకుల్నించి పెద్దమొత్తంలో రుణాలు తీసుకుని ఎగ్గొట్టారనే ఆరోపణలున్నాయి.  సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు 520 కోట్ల రుణం ఎగ్గొట్టారు. అటు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 322 కోట్ల రుణం ఎగవేతకు పాల్పడ్డారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకున్న రుణం వడ్డీతో కలిపి 4 వందల కోట్లకు చేరుకుంది. దాంతో ఆస్థుల వేలానికి నోటీసులు జారీ చేసింది బ్యాంకు. ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా స్పందించకపోవడంతో తనఖా ఆస్థుల్ని వేలం వేసందుకు బ్యాంక్ ఆఫ్ ఇండియా సిద్ధమైంది. Also read: LOC: పాక్ దుశ్చర్య..5 మంది సైనికులు, నలుగురు పౌరుల మృతి

ఈ క్రమంలో సుజనాకు చెందిన ఫెరారీ, బెంజ్ కార్లను స్వాధీనం చేసుకుంది. సుజనాపై 2018లోనే మూడు ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. ఈ యేడాది ఫిబ్రవరి నెలలో సుజనా కార్యాలయాలపై సీబీఐ దాడులు ( CBI ) జరిగాయి. అటు మారిషస్ కు చెందిన బ్యాంకులు సుజనాపై తెలంగాణ హైకోర్టులో కేసులు దాఖలు చేశాయి. కేవలం రుణాల ఎగవేేతే కాకుండా...షెల్ కంపెనీల ద్వారా మనీ ల్యాండరింగ్ చేసినట్టు అభియోగాలు కూడా ఉన్నాయి. 

సుజనా గ్రూప్ సంస్థలు వివిధ బ్యాంకులు, ఆర్ధిక సంస్థల్నించి 8 వేల కోట్లకు పైగా రుణాలు తీసుకున్నాయి. అతని ఆస్థుల విలువ మాత్రం 132 కోట్లకు మించదని తెలుస్తోంది. సుజనా చౌదరి నిర్వహిస్తున్న సంస్థల్లో యూనివర్శల్ ఇండస్ట్రీస్ , సుజనా మెటల్ ప్రొడక్ట్స్, సుజనా టవర్స్ తో పాటు మరో 102 కంపెనీలున్నాయి. ఇందులో విజయ్ హోం అప్లయన్సెస్, మెడ్ సిటీ, లక్ష్మీ గాయత్రి, బెస్ట్ అండ్ కాంప్ట్రాన్ తప్ప మిగిలినవన్నీ షెల్ కంపెనీలే.  ఈ కంపెనీల ద్వారా పన్ను ఎగవేత, మనీ ల్యాండరింగ్ ( Money laundering ) చేశారనే ఆరోపణలున్నాయి సుజనా చౌదరిపై. Also read: Ayodhya: గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించిన అయోధ్య దీపోత్సవం

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x