పాకిస్తాన్ ( Pakistan ) మరోసారి దుశ్చర్యకు పాల్పడింది. కశ్మీర్‌లోని ఎల్వోసీ వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని( Ceasefire ) ఉల్లంఘించి కాల్పులు జరిపింది. పాకిస్తాన్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో భారత ఆర్మీ సైనికులతో సహా 9 మంది మృతి చెందారు.
జమ్ముకశ్మీర్ ( Jammu kashmir ) లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పాకిస్తాన్ దురాగతానికి పాల్పడింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి ఉల్లంఘించింది . పాకిస్తాన్ రేంజర్లు ఒక్కసారిగా భారతీయ శిబిరాలవైపు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇండియన్ ఆర్మీకు చెందిన 5మంది సైనికులు, నలుగురు సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో పది మంది వరకూ గాయపడ్డారు.
లైన్ ఆఫ్ కంట్రోల్ ( Line of control )పై మొత్తం మూడుచోట్ల కాల్పుల ఘటనలు జరిగాయని తెలుస్తోంది. ప్రతిగా భారతీయ ఆర్మీ ( Indian army ) కూడా కాల్పులకు దిగింది. చాలాసేపు రెండుదేశాల మధ్య కాల్పులు పెద్దఎత్తున చోటుచేసుకున్నాయి. రెండు దేశాలు పరస్పరం మోర్టార్లు, ఆయుధాల్ని కూడా ప్రయోగించుకున్నారని సమాచారం. పాకిస్తాన్ రెంజర్లు జరిపిన కాల్పుల్లో( Pakistan firing ) యూరీ సెక్టార్ ( URI Sector ) లో ఓ మహిళ ఇద్దరు పౌరులు మరణించారు. మరో ఇద్దరు సైనికులు వీరమరణం పొందారు. అటు నౌగాం సెక్టార్‌లో కూడా బీఎస్ఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్ మృతి చెందగా..ముగ్గురు పౌరులు గాయపడ్డారు. తాంగ్‌ధర్‌లో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. పూంఛ్‌లోని సౌజియాన్‌లో మరో ముగ్గురు పౌరులు గాయపడ్డారు.
పాకిస్తాన్ ( Pakistan ) దుశ్చర్యకు ప్రతిగా భారత సైనికులు జరిపిన కాల్పుల్లో 7-8 మంది పాక్ సైనికులు హతమయ్యారని తెలుస్తోంది. మరో 10-12 మంది గాయపడ్డారని సమాచారం. అంతేకాకుండా..సరిహద్దుల్లో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ బంకర్లు, ఫ్యూయర్ డంప్స్, లాంచ్ ప్యాడ్స్‌ను భారత సైన్యం పేల్చివేసింది. ఇంతకుముందు మాచిల్ సెక్టార్లో తీవ్రవాదుల చొరబాటు ప్రయత్నాల్ని ఇండియా తిప్పికొట్టడంతో..ప్రతీకారంగా ఇలా తెగబడిందని ఆర్మీ స్పష్టం చేసింది.
Indian army retaliated strongly causing substantial damage to Pakistan Army's infrastructure and casualities across the LoC. pic.twitter.com/BUSCo5kn6C
— Prasar Bharati News Services (@PBNS_India) November 13, 2020
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Also read: Laser show: రాముడి చరిత్రను కళ్లకు కట్టినట్టు చూపించిన లేజర్ షో