Manjeera River Water Flow: తెలంగాణ, మహారాష్ట్రల సరిహద్దున నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర వద్ద మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గత రెండు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పాత బ్రిడ్జి పైనుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో రెండు రాష్ట్రాలకు సంబంధించిన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎగువన గల సింగూర్ ప్రాజెక్టుతో పాటు నిజాంసాగర్ ప్రాజెక్టుల గేట్లు ఎత్తి వరద నీటీని మంజీరా నదిలోకి విడుదల చేశారు. సింగూరు ప్రాజెక్టు, నిజాంసాగర్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతుండటంతో మంజీరా నది ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. బోధన్ మండలం సాలూర గ్రామం వద్ద తెలంగాణ, మహారాష్ట్రలను కలుపుతూ మంజీరా నదిపై బ్రిడ్జి నిర్మాణంలో ఉంది. ఈ నూతన బ్రిడ్జి నిర్మాణం పనులు కొనసాగుతుండడంతో పాత నిజాం కాలం నాటి బ్రిడ్జిపై నుండే ఈ రెండు రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యాలు కొనసాగుతున్నాయి.
అయితే భారీ వర్షాల కారణంగా మంజీరా నదిలో వరద నీరు ఎక్కువ కావడంతో పాత బ్రిడ్జి పూర్తిగా మునిగిపోయే దశకు చేరుకుంది. దీంతో అటు మహారాష్ట్ర ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వం నిన్నటి నుండి రాకపోకలను నిలిపివేసింది. వరద నీరు పోటెత్తడంతో సంబంధిత నీటి పారుదల శాఖ అధికారులు నదీ పరివాహక ప్రాంతం గుండా జాలర్లు కాని గొర్ల, పశువుల కాపరులు గాని సంచరించరాదని హెచ్చరికలు జారీ చేశారు.
తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాలకు రవాణా రాకలు స్తంభించిపోవడంతో నిజామాబాద్ జిల్లా ప్రజలతోపాటు మహారాష్ట్రలోని మరికొన్ని జిల్లాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాత బ్రిడ్జి పై నుండి నీరు ప్రవహిస్తుండడంతో అధికారులు ఆంక్షలు పెటీనప్పటికి కొందరు సాహసిస్తూ దానిపై నుండే ప్రయాణిస్తున్నారు. మహారాష్ట్రకు వెళ్ళవలసిన ప్రయాణికులు కొండల్ వాడి మీదుగా 40 కిలోమీటర్ల మేర తిరిగి ప్రయణిస్తున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 30 వేల క్యూసెక్కులకు మించి ప్రవహిస్తుండడంతో మంజీరా నది పరివాహక ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని బోధన్ ఆర్డీవో రాజేశ్వర్ ప్రజలను కోరారు.
Also Read : Telangana Rain Updates: తెలంగాణలోని ఆ జిల్లాల్లో ఇవాళ అతి భారీ వర్షాలు... ఆరెంజ్ అలర్ట్ జారీ
Also Read : Jagtial SP Sindhu Sharma: వర్షంలోనూ ఎస్పీ సింధూ శర్మ విధులు.. కూతురిని లాలిస్తూనే బందోబస్త్ డ్యూటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి