Jagtial SP Sindhu Sharma: జగిత్యాల జిల్లా ఎస్పీ సింధు శర్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. ఓవైపు జోరున వర్షం కురుస్తున్నప్పటికీ.. ఆ వర్షాన్ని లెక్కచేయకుండా వినాయక నిమజ్జనం బందోబస్తు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఆ మాత్రం దానికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యారా అని అనుకోకండి.. ఎందుకంటే.. అదే సమయంలో తల్లిగా తన ధర్మాన్ని నిర్వర్తిస్తూ తన కూతురును ఎత్తుకుని లాలించారు. కూతురుకి వినాయక నిమజ్జనాలను చూపిస్తూనే అక్కడే ఉన్న పోలీసు సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ బందోబస్తును పర్యవేక్షించారు. దీంతో సింధూ శర్మ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆగకుండా కురుస్తున్న వర్షంలోనూ ఐపీఎస్ ఆఫీసర్ సింధూ శర్మ సివిల్ సర్వెంట్‌గా తన డ్యూటీ చేస్తూనే తల్లిగా కూతురిని కూడా చూసుకోవడంపై నెటిజెన్స్ ఆమెను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు.
2018 సెప్టెంబర్ 5వ తేదీన జగిత్యాల ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సింధు శర్మ.. ఈ మధ్యే ఇక్కడ నాలుగేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. జగిత్యాల జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టి నుంచి సిన్సియర్ ఆఫీసర్‌గా సింధూ శర్మ మంచి పేరు తెచ్చుకున్నారు. సింధూ శర్మ భర్త ఎవరో కాదు.. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక కొండూర్ కావడం గమనార్హం. గతేడాది సెప్టెంబర్‌లో శశాంక మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఒడిషా కేడర్‌కి చెందిన శశాంక సైతం ఐఏఎస్ ఆఫీసర్‌గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
Also Read : Assam CM Himanta Biswa Sarma: హైదరాబాద్‌లో అసోం సీఎంకి అవమానం, భద్రతలో లోపం
Also Read : Drunk Woman Creates Ruckus: ఫుల్లుగా తాగి రోడ్డెక్కిన మహిళ.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి