Maoist Sharadakka surrenders before Telangana DGP : మావోయిస్టు నేత సమ్మక్క అలియాస్ శారదక్క (Sharadakka) పోలీసుల ఎదుట లొంగిపోయారు. శారదక్క చాలా ఏళ్లుగా దళంలో పని చేశారు. 1994లో ఆమె దళంలో చేరారు. శారదక్క అప్పటి కమాండర్ హరిభూషణ్‌ను పెళ్లి చేసకుని మావోయిస్టు కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. దళంలో పలు హోదాల్లో ఆమె పని చేశారు. 2006లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో (Encounter) బుల్లెట్ తగలడంతో శారదక్కకు ఒక కన్ను పోయింది. అయితే గతంలోనూ శారదక్క ఒకసారి పోలీసుల ఎదుట లొంగిపోయారు. 2007లో పోలీసుల ఎదుట లొంగిపోయిన శారదక్క 2011లో మళ్లీ హరిభూషణ్‌తో కలిసి మావోయిస్ట్ పార్టీలో చేరారు.
అయితే హరిభూషణ్ బతికి ఉన్నన్ని రోజులు శారదక్కకు అక్కడ మంచి ప్రియార్టీ ఇచ్చారు. హరిభూషణ్ చనిపోయిన తర్వాత శారదక్కకు కూడా మావోయిస్ట్ (maoist) సిద్ధాంతాలపై ఆసక్తి తగ్గిపోయింది. దీంతో దళాన్ని వీడాలని నిర్ణయించుకుంది ఆమె. ఇక తాజాగా పోలీసుల ఎదుట లొంగిపోయారు. హింస ద్వారా మనం ఏమీ సాధించలేమని.. మావోయిస్టులంతా పోలీసుల ఎదుట లొంగి పోవాలని ఆమె కోరారు.
#Live - Senior CPI Maoist leader Sharadakka, W/o late former Telangana Maoist State Committee secretary Haribhushan, joining the mainstream of public life, to surrender.
Pressmeet starts from 1 PMhttps://t.co/A9nlHjiXL3— DGP TELANGANA POLICE (@TelanganaDGP) September 17, 2021
Also Read : Oil Purify Test: మీరు వాడే వంట నూనె నిజంగా స్వచ్చమైనదా..? ఇలా తెలుసుకోండి..!
శారద జనజీవన స్రవంతిలోకి వచ్చినందుకు 5 లక్షల రివార్డ్‌తో పాటు తాత్కాలిక సాయంగా రూ.5 వేల నగదు ఇస్తున్నాము అని డీజీపీ మహేందర్‌రెడ్డి (DGP Mahender Reddy) తెలిపారు. మరికొందరు మావోయిస్టులు లొంగిపోవటానికి సిద్ధంగా ఉన్నా కూడా మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలు అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు. అనారోగ్యంతో బాధపడే మావోయిస్టులంతా లొంగిపోండి అని సూచించారు. కేంద్ర కమిటీ సభ్యులైన ఆజాద్, రాజీరెడ్డిలు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. కాగా చాలా మంది మావోయిస్టులకు (Maoists)కరోనా సోకినట్లు సమాచారం. సరైన వైద్య సదుపాయాలు అందక వారంతా ఇబ్బందులు పడుతున్నారట. తెలంగాణ నుంచి మావోయిస్ట్ దళంలోకి కొత్తగా ఎవరూ చేరడం లేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook