Telangana DGP: సర్జికల్ స్ట్రైక్ చేస్తామన్న వారిపై కేసులు బుక్ చేస్తాం-తెలంగాణ డీజీపి

GHMC Elections 2020 | గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా వ్యాఖ్యాలు చేస్తే, లేదా పోస్టులు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అన్నారు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం శాంతి భద్రతలకు నిలయం అన్నారు. 

Last Updated : Nov 26, 2020, 10:09 PM IST
    1. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా వ్యాఖ్యాలు చేస్తే,
    2. లేదా పోస్టులు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అన్నారు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి.
    3. తెలంగాణ రాష్ట్రం శాంతి భద్రతలకు నిలయం అన్నారు.
Telangana DGP: సర్జికల్ స్ట్రైక్ చేస్తామన్న వారిపై కేసులు బుక్ చేస్తాం-తెలంగాణ డీజీపి

Telanagna Police | గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా వ్యాఖ్యాలు చేస్తే, లేదా పోస్టులు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అన్నారు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం శాంతి భద్రతలకు నిలయం అన్నారు. గత ఆరేళ్ల కాలంలో ఎలాంటి అసాంఘిక ఘటనలు జరగుకుండా పోలీసు శాఖ చర్యలు తీసుకుంది అని  తెలిపారు. అసాంఘికంగా ప్రవర్తించే వారిపై ప్రత్యేక నిఘా పెట్టాం అని తెలిపారు.

Also Read | TRS Manifesto: టీఆర్ఎస్ హెచ్ఎంసీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల, కీలక అంశాలివే

సోషల్ మీడియాలో (Social Media) వచ్చే తప్పుడు ప్రచారాలను షేర్ చేయవద్దని తెలిపారు డీజీపీ మహేందర్ రెడ్డి. జీహెచ్ఎంసి (GHMC) ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము అని..పోలీసులకు ప్రజలు సహకరించాలని అని కోరారు. సుమారు 51 వేల మందితో భారీ భద్రతను ఏర్పాటు చేశాం అని తెలిపారు. అదే సమయంలో సర్జికల్ స్ట్రైక్ చేస్తాం అని వ్యాఖ్యాలపై కేసులు నమోదు చేస్తాం అని తెలిపారు. 

Also Read | GHMC Elections: హైదరాబాద్ నగరాన్ని కాంగ్రెస్ పార్టీనే అభివృద్ధి చేసింది- ఉత్తమ్ 

ఇలా ఇప్పటి వరకు సుమారు 50 మందిపై కేసులు నమోదు చేశాం అని..అలాగే రోహింగ్యాలపై ఇప్పటి వరకు సుమారు 50-60 కేసులు నమోదు చేశాం అని తెలిపారు. దాంతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) రిజిస్టర్ ఇచ్చిన కంప్లెయింట్ మేరకు తేజస్వీ సూర్యపై కూడా కేసు నమోదు చేసినట్టు వివరించారు.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News