Minister KTR Inaugurates Steel Flyover: వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌ఆర్‌డీపీ)లో హైదరాబాద్ నగరంలో ఇందిరా పార్కు నుంచి వీఎస్టీ మధ్య నిర్మించిన స్టీల్ ఫ్లైఓవర్‌ను మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ బ్రిడ్జి ప్రారంభంతో ఈ ప్రాంతంలో వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఉక్కుతో నిర్మించిన 2.6 కిలో మీటర్ల పొడవు ఉండగా.. నాయిని నర్సింహా రెడ్డి ఫ్లై ఓవర్‌గా నామకరణం చేసిన విషయం తెలిసిందే. ఈ స్టీల్ బ్రిడ్జి ఫ్లైఓవర్ (ఎలివేటెడ్ కారిడార్) అందుబాటులోకి రావడంతో ఇందిరాపార్క్ జంక్షన్ మొదలు అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్ మీదుగా బాగ్ లింగంపల్లి వీఎస్టీ జంక్షన్ వరకు పూర్తిగా ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్లిపోవచ్చు. ఉస్మానియా యూనివర్సిటీ, హిందీ మహా విద్యాలయం వరకు వెళ్లేందుకు ప్రయాణ సమయం బాగా తగ్గనుంది.
ఫ్లై ప్రారంభం అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన ఇది 20వ ఫ్లై ఓవర్ అని తెలిపారు. ఎస్‌ఆర్‌డీపీ కార్యక్రమంలో అద్భుతమైన రోడ్డు రవాణా సౌకర్యాలను అభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు. గత ప్రభుత్వాలు హైదరాబాద్ సెంట్రల్ నగరాన్ని పెద్దగా పట్టించుకోలేదని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో నూతన సచివాలయం, అమరవీరుల స్తూపం, బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం, ప్రస్తుతం ఈ స్టీల్ బ్రిడ్జి వంటి అనేక కార్యక్రమాలతో సెంట్రల్ హైదరాబాద్ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. దీంతోపాటు ఇందిరా పార్కును కూడా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
స్టీల్ బ్రిడ్జి ప్రారంభంతో ఇందిరా పార్క్ నుంచి విద్యానగర్ వరకు దశాబ్దాలుగా ఉన్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఈ ప్రాంతంతో అద్భుతమైన సంబంధాలు ఉన్న కీర్తిశేషులు నాయిని నరసింహారెడ్డి పేరు ఈ స్టీల్ బ్రిడ్జికి పెడుతున్నామని చెప్పారు. నాయిని పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. ట్యాంక్ బండ్ ప్రాంతాన్ని అద్భుతమైన టూరిస్ట్ స్పాట్‌గా అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నట్లు మంత్రి వెల్లడిచారు.
ఈ తొమ్మిదేళ్లలో హైదరాబాద్ విశ్వ నగరంగా ఎదగాలన్న లక్ష్యానికి గట్టి పునాది పడిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. గతంలో మాదిరి మతాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకునే దుస్థితి ఈరోజు మన రాష్ట్రంలో లేదన్నారు. గత పదేళ్లలో మత కల్లోలాలు, గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉందన్నారు. మతాల మధ్య చిచ్చుపెట్టే దుర్మార్గులకు.. చిల్లర పార్టీల మోసాలకు గురైతే మరో వందేళ్లు ఈ నగరం వెనక్కిపోతుందని అన్నారు. 60 ఏళ్లపాటు అధికారంలో ఉండి ఎలాంటి అభివృద్ధి చేయని పార్టీల మోసపు మాటలు నమ్మవద్దని కేటీఆర్ కోరారు. ఇప్పటిదాకా చూసింది కేవలం టైలర్ మాత్రమేనని.. ఇంకా త్వరలో ప్రతిపక్షాలకు బీఆర్ఎస్ పార్టీ సినిమా చూపించబోతుందని వ్యాఖ్యానించారు.
Also Read: New LTC Rules: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యగమనిక.. ఈ 3 రూల్స్‌లో మార్పులు
Also Read: Bank Holidays: పెరగనున్న బ్యాంకు సెలవులు, త్వరలో వారానికి 5 రోజుల పని విధానం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి