Rapido bumper offer free rides to voters to polling station on may 13: కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, లోక్ సభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే అనేక రాష్ట్రాలలో రెండు విడుతలలో ఎన్నికలు ముగిసిపోయాయి. ఇక రేపు మూడో విడత ఎన్నికలు కూడా ప్రారంభంకానున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు హక్కు ఉపయోగించుకోవడంపై ప్రజల్లో అనేకమార్లు అవగాహాన కార్యక్రమాలు కూడా చేపట్టింది. కొందరు ఓటింగ్ డే రోజున, ఏదో హలీడేగా భావిస్తుంటారు. రాజ్యాంగం తమకు కల్పించిన హక్కును పూర్తిగా ఉపయోగించుకోవడంలో విఫలమౌతుంటారు. మరోవైపు ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. ఈ క్రమంలో అనేక రాజకీయ పార్టీల నుంచి వచ్చిన రిక్వెస్ట్ ల మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల సమయాన్ని ఒక గంట పాటు పొడిగిస్తు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
ఇక కేంద్ర ఎన్నికల సంఘం,రాష్ట్ర ఎన్నికల అధికారులతో సమన్వయం చేసుకుని ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపట్టారు. అనేక చోట్ల అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఓటర్లను ప్రభావానికి గురిచేయకుండా అధికారులు పక్కాగా గస్తీని నిర్వహిస్తున్నారు. డబ్బులు,మద్యం సరఫరా చేయకుండా కూడా అధికారులు పకట్భందీ చర్యలు తీసుకుంటున్నారు. ఈక్రమంలో అందరు వచ్చి ఓటింగ్ రోజు తమ హక్కును సక్రమంగా వినియోగించుకొవాలని అనేక సంస్థలు అవగాహాన కల్పిస్తునే ఉంటాయి. ఈక్రమంలో ప్రముఖ ర్యాపీడో రైడ్ సంస్థ ఒక అడుగు ముందుకు వేసి, ఓటర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది.
మే 13 వ తేదీన ఓటర్లు ర్యాపీడో వోట్ నో అనే ఆప్షన్ ఉపయోగించుకుని ఉచితంగా రైడ్ సేవలుపొంద వచ్చని ర్యాపీడో సంస్థ ప్రకటించింది. ముఖ్యంగా ఈ ర్యాపీడో సేవలు.. హైదరాబాద్ తో సహా, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ నగరాల్లో అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించారు. దీని కోసం దాదాపు 10 లకల మంది కెప్టెన్ లను అందుబాటులోకి ఉంచనున్నట్లు కూడా తెలిపింది.
పోలీంగ్ కు వెళ్లే క్రమంలో.. దివ్యాంగులు, సీనియర్ సిటీజన్లు తమ సేవలను ఉచితంగా పొంద వచ్చని ర్యాపీడో సంస్థ తెలిపింది. హైదరాబాద్ లో ర్యాపీడో సంస్థ నిర్వహించిన ఓటరు అవగాహాన కార్యక్రంలో తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ పాల్గోన్నారు. ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకొవాలని సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter