CH Krishnarao Death: సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు కన్నుమూత, సీఎం జగన్, కేసీఆర్‌ల సంతాపం

CH Krishnarao Death: సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు సీహెచ్ కృష్ణారావు మరణించారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణారావు ఇవాళ చివరి శ్వాస విడిచారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 17, 2023, 05:09 PM IST
CH Krishnarao Death: సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు కన్నుమూత, సీఎం జగన్, కేసీఆర్‌ల సంతాపం

CH Krishnarao Death: సన్నిహితులతో బాబాయ్‌గా పిలిపించుకునే ప్రముఖ జర్నలిస్ట్ , రాజకీయ విశ్లేషకుడు సీహెచ్ కృష్ణారావు అనారోగ్యంతో బాధపడుతూ ఇవాళ కన్నుమూశారు. 47 ఏళ్లుగా జర్నలిజంలో ఉంటూ విశేష సేవలందించిన కృష్ణారావు నిక్కచ్చిగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తారనే పేరుంది. కృష్ణారావు మరణం జర్నలిజం రంగానికి తీరనిలోటుగా ప్రముఖులు అభివర్ణిస్తున్నారు. 

గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ జర్నలిస్టు 64 ఏళ్ల కృష్ణారావు ఇక లేరు. దెక్కన్ క్రానికల్ ఆంగ్ల పత్రికలో 18 ఏళ్లపాటు బ్యూరో ఛీఫ్‌గా పనిచేసిన సీహెచ్ కృష్ణారావు గత కొద్దికాలంగా రాజకీయ విశ్లేషకులుగా వివిధ టీవీ ఛానెళ్ల చర్చాగోష్టి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నిర్మాణాత్మక విశ్లేషణ చేయడంలో కృష్ణారావుకు మించినవారు లేరని ప్రతీతి. చాలామంది యువ జర్నలిస్టులకు ఆయన ఆదర్శం. తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ జర్నలిస్టుగా, రాజకీయ విశ్లేషకుడిగా అందరికీ సుపరిచితులు. సీహెచ్ కృష్ణారావు మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా ఇరు రాష్ట్రాల మంత్రులు, ప్రముఖలు, జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు. 

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంతాపం

తెలుగు, ఇంగ్లీషు జర్నలిజంలో కృష్ణారావు మంచి ప్రావీణ్యం సాధించారు. కింది స్థాయి నుంచి ఎదిగిన జర్నలిస్టుగా కృష్ణారావుకు పేరుంది. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ ఏపీ సీఎం జగన్ సంతాపం తెలిపారు. 

తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం

సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్, సీహెచ్ కృష్ణారావు మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. అభ్యుదయ భావాలు కలిగిన కృష్ణారావు చేసిన సేవల్ని స్మరించుకున్నారు. పలు రంగాల్లో లోతైన అవగాహనతో ప్రజా ప్రయోజనాల కోణంలో చేసిన రచనలు, విశ్లేషణలు, టీవీ చర్చలు ఆలోచన రేకెత్తించేవిగా ఉండాయని కేసీఆర్ చెప్పారు. కృష్ణారావు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. 

మరోవైపు సీహెచ్ కృష్ణారావు మరణం పట్ల ఏపీ మంత్రి వేణు గోపాలకృష్ణ, ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, ఏపీ మీడియా అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారుడు దేవులపల్లి అమర్ సంతాపం వ్యక్తం చేశారు. అటు తెలంగాణ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఇతర జర్నలిస్తులు కృష్ణారావు మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. 

Also read: Heavy Rains: తెంలగాణకు మూడ్రోజులు భారీ వర్షాలు, ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News