జీహెచ్‌ఎంసీ (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) ఇటీవలే ఓ ప్రకటనను విడుదల చేసింది. అహింసతో పాటు శాంతి ధర్మాలను ప్రబోధించిన మహాత్మగాంధీ వర్థంతి (జనవరి 30) నాడు గ్రేటర్ హైదరాబాద్‌లోని ఏ ప్రాంతంలో కూడా మాంసం అమ్మకూడదని అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. చెంగిచర్లతో పాటు రామ్‌నాస్‌పుర, అంబర్‌పేట్, న్యూబోయిగూడ ప్రాంతాల్లో కబేళాల్లో ఆ రోజు ఎలాంటి జంతువధలు జరగకూడదని ఓ ప్రకటనను విడుదల చేసింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక హైదరాబాద్‌లో కబేళాలను ఆధునీకరించిన సంగతి మనకు తెలిసిందే. బజార్లలో విచ్చలవిడిగా జరిగే అక్రమ జంతువధను నివారించేందుకే ఈ పద్ధతికి శ్రీకారం చుట్టినట్లు అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. అలాగే కబేళాల్లో మాంసం ఉత్పత్తి జరిగిన తరువాత వెలువడే వ్యర్థాలను ప్రాసెస్ చేసేందుకు చెంగిచెర్లలో రెండరింగ్ ప్లాంటును కూడా ఇదే ప్రభుత్వం ఏర్పాటు చేసింది
హైదరాబాద్‌లో ఆ రోజు మాంసం అమ్మరు..!