టిఎస్ఆర్టీసీ సమ్మె, హైకోర్టు ఆదేశాలపై సీఎం కేసీఆర్ సమీక్ష

టిఎస్ఆర్టీసీ సమ్మె: హైకోర్టు ఆదేశాలపై సీఎం కేసీఆర్ సమీక్ష

Updated: Nov 12, 2019, 08:25 PM IST
టిఎస్ఆర్టీసీ సమ్మె, హైకోర్టు ఆదేశాలపై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్: టిఎస్ఆర్టీసీ సమ్మె, నేడు హై కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునిల్ శర్మ, ఇతర ఆర్టీసీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆర్టీసీ సమ్మెకు పరిష్కారం కనుగొనే దిశగా ఓ కమిటీని నియమిస్తామని స్పష్టంచేసిన హైకోర్టు.. కమిటీ ఏర్పాటుపై ప్రభుత్వం తమ అభిప్రాయాన్ని చెప్పాల్సిందిగా నేడు అడ్వకేట్ జనరల్‌ను ఆదేశించిన సంగతి తెలిసిందే. 

హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో మంగళవారం హైకోర్టులో విచారణ సందర్భంగా ప్రస్తావనకొచ్చిన అంశాలు, జరిగిన వాదనలపై సీఎం కేసీఆర్ ఆరా తీస్తున్నట్టు సమాచారం. హైకోర్టు చెప్పిన విధంగా కమిటీని ఏర్పాటు చేయాల్సి వస్తే.. ఆ విషయంలో ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుందనే అంశాలపై సైతం ఈ సమీక్షా సమావేశంలోనే చర్చించనున్నారని తెలుస్తోంది.