Revanth Reddy: సింగరేణి అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండం పరిధిలోని సింగరేణి లాంగ్‌వాల్ ప్రాజెక్టులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కార్మికులు పనుల్లో ఉన్న సమయంలో గని పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందినట్టు తెలుస్తోంది. నలుగురిని మాత్రం చికిత్స నిమిత్తం రామగుండం ఆసుపత్రికి తరలించారు. గని ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది. మరోవైపు ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. తక్షణం సహయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని స్పష్టం చేశారు.
మరోవైపు ఈ ఘటనపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. సింగరేణి ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఆరోపించారు. వారం రోజుల క్రితమే గని పైకప్పు స్వల్పంగా కూలినా..ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోకుండా కార్మికుల్ని గనిలోకి అనుమతించారని రేవంత్ రెడ్డి చెప్పారు. అధికారుల తప్పిదం కారణంగా నలుగురు కార్మికుల ప్రాణాలు బలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కార్మికుల భద్రతకు యాజమాన్యం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
Also read: Singareni Coal Mine Accident: సింగరేణి బొగ్గు గనిలో ఘోర ప్రమాదం.. నలుగురు కార్మికులు మృతి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook