యురేనియం తవ్వకాలపై కేటీఆర్ కీలక ప్రకటన

యురేనియం తవ్వకాలపై కేటీఆర్ కీలక ప్రకటన

Last Updated : Sep 15, 2019, 10:37 PM IST
యురేనియం తవ్వకాలపై కేటీఆర్ కీలక ప్రకటన

హైదరాబాద్: యురేనియం తవ్వకాలపై రాష్ట్రంలోని రాజకీయపక్షాలన్నీ ఏకమవుతున్న ప్రస్తుత తరుణంలో శాసనమండలిలో మంత్రి కేటీఆర్‌ ఓ కీలకమైన ప్రకటన చేశారు. యురేనియం నిక్షేపాల కోసం నల్గొండ జిల్లాలో అన్వేషణ చేపట్టాం కానీ.. నాగర్‌కర్నూల్‌- అమ్రాబాద్‌ ప్రాంతంలో ఎలాంటి అన్వేషణ చేపట్టలేదని చెప్పిన కేటీఆర్.. యురేనియం నిక్షేపాల తవ్వకం కోసం రాష్ట్రం ఎలాంటి అనుమతి ఇవ్వలేదని స్పష్టంచేశారు. ఒకవేళ ఆ ప్రాంతంలో యురేనియం నిక్షేపాలు ఉన్నా అనుమతులు ఇవ్వబోమని, వన్యప్రాణుల సంరక్షణ విభాగం తేల్చిచెప్పిందని కేటీఆర్‌ గుర్తుచేశారు. 

యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఇప్పటికే పలువురు మేధావులు, రాజకీయ పార్టీల నేతలు, సినీ ప్రముఖులు ఉద్యమాలు చేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో శాసన మండలిలో కేటీఆర్ చేసిన ఈ ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది.

Trending News