TSRTC: ఆర్టీసీ ఛార్జీల పెంపుకు రంగం సిద్ధం-ఛైర్మన్ బాజిరెడ్డి కీలక వ్యాఖ్యలు

TSRTC to hike bus fares: తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల పెంపు ఖాయమని సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి తేల్చేశారు. ధరల పెంపు ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 1, 2021, 02:40 PM IST
  • తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల పెంపునకు ప్రతిపాదనలు
  • ఛార్జీల పెంపుపై మంత్రి పువ్వాడ, ఛైర్మన్ బాజిరెడ్డి, ఎండీ సజ్జనార్ సమీక్ష
  • త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం
 TSRTC: ఆర్టీసీ ఛార్జీల పెంపుకు రంగం సిద్ధం-ఛైర్మన్ బాజిరెడ్డి కీలక వ్యాఖ్యలు

TSRTC to hike bus fares: తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల పెంపుకు రంగం సిద్ధమైంది. ఇక రేపో మాపో ఛార్జీల పెంపుపై సీఎం కేసీఆర్ (CM KCR) నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తాజాగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఛార్జీల పెంపుపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్  (TSRTC Chairman) మాట్లాడుతూ... ఛార్జీల పెంపును ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. ఆర్డినరీ బ‌స్సుల్లో కిలోమీట‌ర్‌కు 20 పైస‌లు చొప్పున, ఇత‌ర బ‌స్సుల్లో (RTC Bus Fare) కిలోమీట‌ర్‌కు 30 పైస‌లు చొప్పున పెంపుకు ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. 

పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం అనుసరిస్తున్న విధానాల వ‌ల్లే ఛార్జీలు పెంచాల్సి వ‌స్తోంద‌న్నారు. పెరిగిన డీజిల్ ధరలు ఆర్టీసీ భారంగా మారాయని అన్నారు. ఆర్టీసీ రోజుకు 6.8 ల‌క్ష‌ల లీట‌ర్ల డీజిల్ వినియోగిస్తోంద‌ని.. పెరిగిన ధరలతో సంస్థపై అధిక భారం పడుతోందని పేర్కొన్నారు. రోజురోజుకు పెరుగుతున్న నష్టాలను భరించే స్థితిలో ఆర్టీసీ (TSRTC) లేదని బాజిరెడ్డి అన్నారు. ఇప్పటికే 1400 ఆర్టీసీ బస్సులు పాడయ్యాయని... కొత్త వాటిని కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. డీజిల్ ధరలకు తోడు స్పేర్ పార్ట్స్ ధరలు కూడా పెరగడం ఆర్టీసీపై భారాన్ని పెంచుతోందన్నారు. ధరల పెంపు ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు.

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) మాట్లాడుతూ... ఆర్టీసీలో రెండేళ్ల క్రితం ఛార్జీలు పెంచామని గుర్తుచేశారు. కరోనా సమయంలో సంస్థకు నష్టం వాటిల్లినా... కార్మికులను కడుపులో పెట్టుకుని కాపాడుకున్నామన్నారు. కరోనా (Covid 19) తర్వాత కొత్తగా 561 సర్వీసులు పెంచామన్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ... ఓవైపు కరోనాతో సంస్థకు నష్టం రావడం.. మరోవైపు పెరిగిన డీజిల్ ధరలతో రూ.468 కోట్ల అదనపు భారం పడటం... మొత్తంగా సంస్థపై రూ.1400 కోట్ల మేర నష్టాల్లో ఉందని అన్నారు. ఈ పరిస్థితుల్లో అనివార్యంగా టికెట్ ధరలు పెంచాల్సి వస్తోందన్నారు.

Also Read: Petrol Price In Delhi: ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం.. పెట్రోల్ పై రూ.8 తగ్గింపు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x