శుభవార్త: వయోపరిమితి పెంచిన ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వయోపరిమితిని పెంచింది.

Last Updated : Jun 4, 2018, 07:40 AM IST
శుభవార్త: వయోపరిమితి పెంచిన ప్రభుత్వం

తెలంగాణలోని గ్రామ రెవిన్యూ అధికారి(వీఆర్వో), గ్రూప్-4, మండల ప్లానింగ్ స్టాటిస్టికల్ ఆఫీసర్/అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు ప్రభుత్వం పదేళ్ల వయోపరిమితి సడలింపు ఇచ్చింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్లలో పేర్కొంది. వయోపరిమితి లెక్కింపునకు 2018 జులై 1వ తేదీని కటాఫ్ గా నిర్ణయించగా, జనరల్ అభ్యర్థులకు సాధారణ గరిష్ట వయోపరిమితి 34 ఏళ్ల నుంచి తాజాగా పెంపుతో 44 ఏళ్లకు వర్తించనుంది.ఎస్సీ, ఎస్టీ, బీసీలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదనంగా ఐదేళ్లు, ఎక్స్‌సర్వీస్‌మన్‌లకు మూడేళ్లు, ఎన్‌సీసీ వారికి మూడేళ్లు, వికలాంగులకు పదేళ్ల మేర అదనపు వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.

అటు ఆర్టీసీ ఉద్యోగాలకు మాత్రం సాధారణ గరిష్ట వయోపరిమితికి, ప్రభుత్వం ఇచ్చిన సడలింపు కలుపుకొని జనరల్‌ అభ్యర్థులకు 40 ఏళ్లు.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు, ఎక్స్‌సర్వీస్‌మన్‌కు మూడేళ్లు వయోపరిమితి సడలింపు ఉంటుందని వెల్లడించింది. మొత్తంగా ఆర్టీసీలోని పోస్టులకు 45 ఏళ్లు దాటినా వారు అర్హులు కారని స్పష్టం చేసింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు https://www.tspsc.gov.in/లలో చూడవచ్చు.

Trending News