Hyderabad Outer Ring Road: ఓఆర్ఆర్ అంశంపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత సంబంధిత శాఖా మంత్రిది అని.. కానీ తాను ఇరుక్కుపోతాననే కేటీఆర్ ముఖం చాటేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. ఔటర్ రింగ్ రోడ్డు అంశంపై కేటీఆర్ మౌనం వెనక మర్మం ఏమిటి..? అని ప్రశ్నించారు. ఓఆర్ఆర్ టెండర్ల విషయంలో వేల కోట్లు చేతులు మారాయని.. అరవింద్ కుమార్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. మాజర్ సంస్థ నివేదిక ప్రకారం టెండర్లు ఇచ్చామని సమర్థించుకుంటున్నారని.. మాజర్ సంస్థపై అమెరికాలో కేసులు నమోదయ్యాయని అన్నారు. గురువారం ఔటర్ రింగ్ రోడ్డు అంశంపై రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
'ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ పరిధిలో ఉండేది. ఐఈఆర్‌బీకు అప్పగించేందుకు ఓఆర్ఆర్‌ను హెచ్‌ఎండీఏ పరిధిలోకి తీసుకొచ్చారు. దీని వెనక గూడుపుఠాణి ఏమిటో బయటపెట్టాలి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కొంటామన్న కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆస్తిని ఎందుకు ప్రయివేటుకు కట్టబెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ నేషనల్ హైవే అథారిటీ అభ్యంతరం చెప్పింది.
ఎన్‌హెచ్‌ఏఐ నిబంధనల ప్రకారం టెండర్లు ఇవ్వలేదు. బేస్ ప్రైస్ నిర్ణయించకుండా టెండర్ ఎవరైనా పిలుస్తారా..? టోల్ గేట్‌పై రోజుకు రూ.2 కోట్ల ఆదాయం వస్తుంది. ఏడాదికి రూ.730 కోట్లు.. 30 ఏళ్లకు 22వేల కోట్లు ఆదాయం వస్తుంది. అలాంటి ఔటర్ రింగ్ రోడ్డుకు 16 వేల కోట్లు బ్యాంకు రుణం వస్తుంది.
కానీ ప్రభుత్వం తక్కువ ధరకే ప్రయివేటుకు కట్టబెట్టింది. స్విస్ ఛాలెంజ్ విధానంలో బేస్ ప్రైస్ రూ.7,388 కోట్లతో టెండర్లకు పిలవండి. ఐఆర్‌బీ కంపెనీని ముందు పెట్టి తరువాత కేటీఆర్ బినామీ కంపెనీలతో ఇందులోకి ప్రవేశించే కుట్ర జరుగుతోంది. 30 ఏండ్లు వీళ్లే దోపిడీలకు పాల్పడుతున్నారు. బేస్ ప్రైస్ పెట్టాము కానీ చెప్పం అని అంటున్నారు. అందులో ఏమైనా దేశ భద్రత, కేసీఆర్ ప్రాణం ఏమైనా ఉందా..? బేస్ ప్రైస్ చెప్పడానికి ఏమిటి నష్టం..? అరవింద్ కుమార్ మేం లేవనెత్తిన ఏ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. ఆర్టీఐ ప్రకారం మేం అడిగిన సమాచారాన్ని కూడా ఇవ్వలేదు. సీబీఐ, ఈడీకి కూడా సమాధానం ఇవ్వరా..? తక్షణమే ఈ టెండర్లను రద్దు చేయాలి..' అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు
తెలంగాణ ఆస్తులను కేసీఆర్ ప్రయివేటుకు అమ్మడానికి వీల్లేదని స్పష్టం చేశారు. లక్ష కోట్ల విలువైన ఓఆర్ఆర్‌ను అగ్గువకే ప్రయివేటుకు కట్టబెడుతున్నారని అన్నారు. స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, డీవోపీటీకు అరవింద్ కుమార్‌పై ఫిర్యాదు చేస్తామన్నారు. ఓఆర్ఆర్ అంశంపై కాగ్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఓఆర్ఆర్ టెండర్ల విషయంలో వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. దీనికి కేటీఆర్ కారణని అన్నారు. ఇంత జరుగుతున్నా.. తండ్రీకొడుకులు బయటకు వచ్చి వివరణ ఇవ్వడం లేదన్నారు. తెలంగాణ కేబినెట్‌కు అతీత శక్తులు లేవని.. కల్వకుంట్ల రాజ్యాంగం ఇక్కడ చెల్లదని స్పష్టం చేశారు.
Also Read: Delhi BRS Party Office: ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం.. ప్రత్యేకతలు ఇవే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook