Congress Kollapur Public Meeting: కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నాడని.. మరో లక్ష కోట్లు దోచుకునేందుకు మళ్లీ అధికారం ఇవ్వమంటున్నారని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని.. ఆరు గ్యారంటీలను ప్రతి ఇంటికి చేరుస్తామన్నారు.
Telangana Vijaya Bheri Yatra in Sangareddy: నన్ను రేటెంత రెడ్డి అని కేసీఆర్ అంటున్నారని.. తనను కొనేటోడు ఈ భూమ్మీద ఇంకా పుట్టలేదంటూ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని.. కేసీఆర్ జీవిత కాలం ఫామ్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకోవాల్సిందేనని అన్నారు.
Revanth Reddy Fires On KTR and Harish Rao: మంత్రులు కేటీఆర్, హరీష్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చిత్తకార్తె కుక్కల్లా తిరుగుతున్నారంటూ ఓ రేంజ్ విమర్శలు గుప్పించారు. మరో 45 రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు.
Revanth Reddy On Congress Candidate List: కాంగ్రెస్ అభ్యర్థులపై ప్రకటనపై రియాక్ట్ అయ్యారు రేవంత్ రెడ్డి. మీడియా సంయమనం పాటించాలని.. నిర్ణయం తీసుకున్న తరువాత ప్రకటిస్తామని చెప్పారు. బస్సు యాత్రకు ముందు ప్రకటించాలా..? యాత్ర మధ్య ప్రకటించాలా..? అనే నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.
Revanth Reddy Vs Minister KTR: నాగర్ కర్నూలు, అచ్చంపేట నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్ పలువురు నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పాలమూరు జిల్లాలో 14కు 14 సీట్లు గెలిపించాలని కోరారు.
Revanth Reddy Letter to Minister KTR: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలు, లోతట్టు ప్రాంతాల పరిస్థితిపై మంత్రి కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దామని సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడానికే సరిపోయిందంటూ ఫైర్ అయ్యారు. విశ్వనగరమో.. విషాద నగరమో తేలిపోయిందన్నారు.
కేసీఆర్ పుట్టింది రైతుల కోసం కాదు. రైతులను పాడే ఎక్కించడానికే అని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతును రాజును చేసినం అని ప్రగల్భాలు పలికే చిన్న దొరా.. రైతు ఎట్లా రాజయ్యిండో సమాధానం చెప్పాలే అని డిమాండ్ చేస్తూ మంత్రి కేటీఆర్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు.
EX MP Ponguleti Srinivas Reddy News: అభిమానులు, కార్యకర్తల నిర్ణయం మేరకే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు రేవంత్ రెడ్డి. ఖమ్మంలో 10కి 10 అసెంబ్లీ స్థానాలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
Revanth Reddy Fires on KTR: తెలంగాణ అమరుల స్థూపం నిర్మాణంలో భారీ అక్రమాలు జరిగాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రూ.80 కోట్లకు మొదలైన అగ్రిమెంట్.. 179 కోట్ల 5 లక్షలకు పెంచేశారని అన్నారు. కేటీఆర్‌ను బాటా చెప్పులతో కొట్టినా ఆయన పాపాలు తొలగిపోవంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
TPCC Chief Revanth Reddy Challenges Ministers KTR, Harish Rao: లక్ష కోట్ల విలువైన ఆస్తిని కేవలం రూ.7,300 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. దీంతో పోలిస్తే ఢిల్లీ లిక్కర్ స్కాం చాలా చిన్నదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అయితే ఇంత బహిరంగంగానే దోపిడీ జరుగుతుంటే బీజేపీ నేతలు ఏంచేస్తున్నారని ప్రశ్నించారు.
Revanth Reddy On ORR Bidding Issue: బీఆర్ఎస్ ప్రభుత్వం మరో దోపిడీకి తెరలేపిందని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. ఈ దారి దోపిడీ దొంగతనానికి ఎప్పుడో రిటైర్ అయిన బీఎల్ఎన్ రెడ్డిని తీసుకొచ్చారని విమర్శలు గుప్పించారు. అక్రమ సొమ్ముతో పెట్టుబడులు పెట్టడానికే కేటీఆర్ విదేశీ పర్యటనలు చేస్తున్నారని ఆరోపించారు.
Revanth Reddy on Go No 111 Cancelation: జీవో 111 రద్దుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. ఇది దుర్మార్గపు నిర్ణయమని.. కేసీఆర్‌ను కోసి కారం పెట్టినా తప్పులేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జీవో రద్దు వెనక కుట్ర ఉందన్నారు.
Revanth Reddy Fires On Cm KCR: సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. కర్ణాటకలో హంగ్ తీసుకురావాలని కేసీఆర్ చేసిన కుట్రలను తాము బయటపెట్టామన్నారు. కర్ణాటకలో మోదీ ఓటమిని అంగీకరించేందుకు కూడా కేసీఆర్‌కు మనసు ఒప్పడం లేదన్నారు.
Revanth Reddy On CM KCR: ఈ నెల 8న సరూర్ నగర్లో నిర్వహించనున్న బహిరంగ సభకు భారీగా తరలిరావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సభలో ప్రియాంక గాంధీ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ప్రకటిస్తారని చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనలో రైతులు, నిరుద్యోగులకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు.
Hyderabad Outer Ring Road: ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ల విషయంలో వేల కోట్లు చేతులు మారాయని ఆరోపించారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఆస్తులను ప్రయివేట్‌కు కట్టబెట్టడం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే ఈ టెండర్లను రద్దు చేయాలని అన్నారు.
Revanth Reddy on Bandi Sanjay: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ వరదల సమయంలో బండి పోతే బండి ఇస్తామని చెప్పారని.. కానీ ఆ తరువాత ఇన్సూరెన్స్ ఉంది కదా.. అంటూ తప్పించుకున్నారని అన్నారు.
Revanth Reddy Comments on Alliance with BRS: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్తో పొత్తులపై రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ మాఫియాతో చేతులు కలపదని.. తాను టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నంత వరకు బీఆర్ఎస్తో పొత్తు ఉండదన్నారు.
Revanth Reddy On Minister KTR: పొద్దున లేచిప్పటి నుంచి రాత్రి వరకు మంత్రి కేటీఆర్ సినిమా వాళ్లతోనే తిరుగుతుంటాడని రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తన ప్రసంగంలో నటి సమంత పేరును కూడా తెరపైకి తీసుకువచ్చారు ఆయన. సీఎం కేసీఆర్‌పై కూడా ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు.
తన పాదయాత్రకు భద్రత పెంచాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ ప్రత్యర్థులు తన యాత్ర దాడులకు దిగుతున్నట్లు పిటిషన్లో పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఇలా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.