రిజర్వేషన్లపై చర్చించాలని కోరుతూ టీఆర్ఎస్ పార్టీ లోక్సభ స్పీకర్ కు నోటీసులు జారీ చేసింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేసన్లు 50 శాతానికి మించి పెంచుకునేందుకు వీలు కల్పిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 16ను సవరించాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఎంపీలు నిరసన బాటపట్టారు. టీఆర్ఎస్ నిరసనతో పార్లమెంట్ ఆవరణంతా ప్లకార్డులు, ఎంపీల నినాదాలతో హోరెత్తుతున్న పరిస్థితి నెలకొంది. ఎన్నికల సమయంలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ టీఆర్ఎస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీన్ని అమలు చేయాలంటే కేంద్రం అనుమతి తప్పనసరి. ఈ నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చే దిశగా టీఆర్ఎస్ తమ గళాని విప్పింది.