హైదరాబాద్: వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేయనున్న టీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదివారం సాయంత్రం ప్రకటించిన వివరాల ప్రకారం రంగారెడ్డి నుంచి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ నుంచి తేరా చిన్నప రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలవనున్నారు. ఆయా జిల్లాల మంత్రులతో సమావేశమైన అనంతరమే కేసీఆర్ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.
మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్కు పూర్తిస్థాయి మెజార్టీ ఉందని, టీఆర్ఎస్ అభ్యర్థులు సునాయసంగా విజయం సాధిస్తారని కేసీఆర్ ధీమా వ్యక్తంచేశారు.