Telangana Rythu Bandhu: రైతులకు గుడ్​ న్యూస్​- రేపటి నుంచే ఖాతాల్లో రైతు బంధు జమ

Telangana Rythu Bandhu: రైతు బంధు ఎనిమిదవ విడత అమలుకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం. రేపటి నుంచి లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లో పంట సహాయం జమ చేయనున్నట్లు తెలిపింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 28, 2021, 12:03 PM IST
  • రేపటి నుంచి రైతు బంధు ఎనిమిదవ విడత అమలు
  • 10 రోజుల్లో లబ్ధిదారులందరి ఖాతాల్లో డబ్బు జమ
  • రూ.7,645 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడి
Telangana Rythu Bandhu: రైతులకు గుడ్​ న్యూస్​- రేపటి నుంచే ఖాతాల్లో రైతు బంధు జమ

Telangana Rythu Bandhu: తెలంగాణ రైతులకు గుడ్​ న్యూస్​. రేపటి నుంచి (డిసెంబర్ 28 మంగళవారం) రైతు బంధు పథకం కింద పెట్టుబడి సాయం అందనుంది. ఎనిమిదవ విడత కింద రైతుల ఖాతాల్లో రేపటి నుంచి డబ్బు జమ చేయనున్నట్లు (Rythu Bandhu latest news) ప్రభుత్వం ఇది వరకే ప్రకటించింది.

యాసంగి సీజన్​కు సంబంధించి ఈ సాయం అందనుంది. ఈ మేరకు తెలంగాణ వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధికారికంగా ప్రకటన (Minister S Niranjan Reddy) చేశారు.

పథకం కోసం ఖర్చులు ఇలా..

రైతు బంధుకోసం తెలంగాణ ప్రభుత్వం ఏడు విడతల్లో రూ.43 వేల కోట్లకుపైగా ఖర్చు చేసింది. ఇక ఎనిదిదవ విడత పూర్తయితే ఈ మొత్తం రూ.50 వేల కోట్లకు చేరనుందని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.

ఎంత మంది రైతులకు లబ్ధి?

యాసంగి సీజన్​లో 66.61 లక్షల రైతులను రైతుబంధుకు అర్హులుగా తేల్చినట్లు చెప్పారు మంత్రి నిరంజన్​ రెడ్డి. మొత్తం 152.91 లక్షల ఎకరాల భూమికి సంబంధించి రైతు బంధు సహాయం అందించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం రూ.7,645 కోట్లకుపైగా ఖర్చు చేయనున్నట్లు వివరించారు.

ఎప్పటి లానే తక్కువ భూమి ఉన్న రైతులకు ముందుగా సహాయం అందించనున్నట్లు తెలిపారు. పది రోజుల్లోగా అందరి ఖాతాల్లో డబ్బు జమ అవుతుందని స్పష్టం చేశారు మంత్రి.

రైతు బంధు కోసం అప్పు..

రైతు బంధు పథకం కోసం ప్రభుత్వం ఈ నెలలోనే దాదాపు రూ.3,500 కోట్ల అప్పు తీసుకుంది. ఇందుకోసం 11 ఏళ్ల కాలపరిమితితో బాండ్లను జారీ చేసింది. మిగత మొత్తాన్ని పన్నులు, ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయంలో కొంత మొత్తం ఈ పథకం కోసం కేటాయించారు.

రైతు బంధు ఖాతాల్లో జమ అయిన వెంటనే.. సంబంధిత రైతు మొబైల్​కు సందేశం అందుతుందని.. దానిని రైతులు ఎప్పుడైనా విత్​డ్రా చేసుకోవచ్చని ప్రభుత్వం వెల్లడించింది.

Also read: Telangana Omicron Cases : తెలంగాణలో మరో 3 ఒమిక్రాన్‌ కేసులు.. మొత్తం 41 కేసులు

Also read: Omicron Scare: తెలంగాణలో మళ్లీ కఠిన ఆంక్షలు- న్యూ ఇయర్ వేడుకలు బంద్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News