మంత్రి హరీష్ రావు నివాసం ముట్టడికి ఆర్టీసీ కార్మికుల యత్నం

మంత్రి హరీష్ రావు నివాసం ముట్టడికి ఆర్టీసీ కార్మికుల యత్నం.. అడ్డుకున్న పోలీసులు

Updated: Nov 11, 2019, 01:40 PM IST
మంత్రి హరీష్ రావు నివాసం ముట్టడికి ఆర్టీసీ కార్మికుల యత్నం

సిద్ధిపేట: టిఎస్ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేటితో 38వ రోజుకు చేరుకుంది. దీంతో 38 రోజులుగా సమ్మె చేస్తున్నా తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహించిన పలువురు కార్మికులు సోమవారం ఉదయం సిద్ధిపేటలోని మంత్రి హరీష్ రావు నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మంత్రి హరీష్ రావు నివాసం వైపు ర్యాలీగా బయల్దేరారు. ఆర్టీసి కార్మికుల ఆందోళన గురించి తెలుసుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, కార్మికులకు మధ్య తోపులాట చోటుచేసుకుని ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. 

హరీష్ రావు నివాసం బయట ఉద్రిక్తతల నేపథ్యంలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న పలువురు మహిళలు సొమ్మసిల్లి పడిపోగా చికిత్స నిమిత్తం వారిని సిద్ధిపేటలోని ఓ ఆసుపత్రికి తరలించారు.