TSWRJC CET 2021 నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలు, Application Form వివరాలు ఇక్కడ తెలుసుకోండి

TSWRJC CET 2021 Notification: టీఎస్‌డబ్ల్యూఆర్‌జేసీ సెట్‌-2021 నోటిఫికేషన్‌ ఇటీవల విడుదల అయింది. TSWRJC CET 2021 Application Form, ముఖ్యమైన తేదీలు, సెట్ పూర్తి వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.

Written by - Shankar Dukanam | Last Updated : Feb 7, 2021, 02:10 PM IST
  • టీఎస్‌డబ్ల్యూఆర్‌జేసీ సెట్‌-2021 నోటిఫికేషన్‌ ఇటీవల విడుదల
  • గురుకుల జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రవేశాల కోసం సెట్
  • ఈ ఏడాది పదో తరగతి పరీక్ష రాయనున్న రెగ్యూలర్ విద్యార్థులకు ఛాన్స్
TSWRJC CET 2021 నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలు, Application Form వివరాలు ఇక్కడ తెలుసుకోండి

TSWRJC CET 2021 Notification: తెలంగాణలో టీఎస్‌డబ్ల్యూఆర్‌జేసీ సెట్‌-2021 నోటిఫికేషన్‌ ఇటీవల విడుదల అయింది. తెలంగాణ రాష్ట్రంలోని సాంఘిక సంక్షేశాఖ ఆధ్వర్యంలోని గురుకుల జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రవేశాల కోసం టీఎస్‌డబ్ల్యూఆర్‌జేసీ నోటిఫికేషన్(TSWRJC CET 2021 Notification) విడుదల చేశారు. 

ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సెస్సీ, సీబీఎస్‌ఈ లేదా ఐసీఎస్‌ఈ బోర్డుల ద్వారా 10వ తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులు ఫిబ్రవరి 10 నుంచి TSWRJC CET 2021కు దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు TSWREIS వెబ్‌సైట్ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

Also Read: HCL Recruitment : హెచ్‌సీ‌ఎల్ విజయవాడలో భారీగా ఉద్యోగాలు..ఎలా దరఖాస్తు చేసుకోవాలి

ఇందులో సాధించిన మెరిట్ ఆధారంగా, ఆయా సామాజిక వర్గాలకు Telangana లోని  గురుకుల జూనియర్‌ కాలేజీల్లో కేటాయించిన సీట్లను విద్యార్థులకు కేటాయిస్తారు. అయితే కుటుంబ వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.2 లక్షలు మించకుండా, గ్రామాల్లో అయితే లక్షన్నర రూపాయలకు మించకుండా ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 

Also Read: IBPS క్లర్క్ ప్రిలిమ్స్ రిజల్ట్ 2021 కోసం క్లిక్ చేయండి, Resul డైరెక్ట్ లింక్ మీకోసం

ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తులు ప్రారంభం: ఫిబ్రవరి 10, 2021
- దరఖాస్తు ఫీజు: రూ.100 చెల్లించాలి
- ఎంపిక విధానం: రాతపరీక్ష
- దరఖాస్తుa చివరితేదీ: ఫిబ్రవరి 28, 2021
- రాత పరీక్ష: ఏప్రిల్‌ 4, 2021

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News