/telugu/photo-gallery/puri-jagannadh-explains-about-emotional-blockmail-in-puri-musings-pa-180794 Puri Jagannadh: వాళ్లు అమాయకులుగా కన్పించే క్రిమినల్స్..  షాకింగ్ కామెంట్స్ చేసిన పూరీ జగన్నాథ్.. స్టోరీ ఏంటంటే..? Puri Jagannadh: వాళ్లు అమాయకులుగా కన్పించే క్రిమినల్స్.. షాకింగ్ కామెంట్స్ చేసిన పూరీ జగన్నాథ్.. స్టోరీ ఏంటంటే..? 180794

Unemployed Protest: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితి పెంచాలన్న డిమాండ్ ఊపందుకుంది. తమకు న్యాయం చేయాలంటూ అభ్యర్థులు సైతం ఆందోళన బాట పడుతున్నారు. ఇన్ని రోజులు ప్రభుత్వ శాఖల్లో ఖాళీలకు భర్తీ చేయకుండా..ఇప్పుడు ఏకపక్షంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ఆరోపిస్తున్నారు. కేసీఆర్ సర్కార్ తీరును నిరసిస్తూ రోడెక్కుతున్నారు. ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామంటున్నారు.

తెలంగాణలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలకు భర్తీ చేస్తామని ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించారు. విడతల వారీగా నోటిఫికేషన్లు సైతం వస్తున్నాయి. ఐతే పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీ వివాదస్పదమవుతోం ది. కానిస్టేబుల్ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈక్రమంలోనే హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయాన్ని అభ్యర్థులు ముట్టడించారు.  

ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్లకార్డులతో ధర్నా చేపట్టారు. పోలీస్ శాఖ ఉద్యోగాలకు వయోపరిమితిని రెండేళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. 2020లో రావాల్సిన నోటిఫికేషన్‌ను వాయిదా వేస్తూ వచ్చారని మండిపడ్డారు. దీనిపై మంత్రులు, డీజీపీని కలిసినా ప్రయోజనం లేదని వాపోతున్నారు. అగ్నిమాపక, జైళ్ల శాఖలో కానిస్టేబుళ్ల ఉద్యోగాలకు గతంలో 35 ఏళ్ల వయోపరిమితి ఉండేదని..కానీ ఇప్పుడు 30 ఏళ్ల తగ్గించారని తెలిపారు. 

డీజీపీ కార్యాలయం ముందు అభ్యర్థుల ఆందోళనతో లక్డికపూల్‌లో ఉద్రికత్త నెలకొంది. భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రంగంలోకి దిగిన పోలీసులు వారిని చెదరగొట్టారు. పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చి..అభ్యర్థులను గోషామహల్‌ పోలీస్ గ్రౌండ్స్‌కు తరలించారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదంటున్నారు అభ్యర్థులు.

Also read:Campus Activewear Shares: లిస్టింగ్ డే నాడే 42 శాతం పైకి ఎగిసిన క్యాంపస్ యాక్టివేర్ షేర్ ధరలు

Also read:CM Jagan Review: రాజధాని పనులు వేగవంతం చేయండి..సీఎం జగన్ ఆదేశం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Section: 
English Title: 
Unemployed Protest in Hyderabad Dgp office Lakdikapool Traffic jam zee telugu news 2022
News Source: 
Home Title: 

Unemployed Protest: మాకు అవకాశం ఇవ్వండి..అభ్యర్థుల ఆందోళన..!

Unemployed Protest: మాకు అవకాశం ఇవ్వండి..అభ్యర్థుల ఆందోళన..!
Caption: 
Unemployed Protest in Hyderabad Dgp office Lakdikapool Traffic jam zee telugu news 2022(file)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

వివాదస్పదమవుతున్న వయో పరిమితి అంశం

డీజీపీ కార్యాలయం ముందు అభ్యర్థుల ఆందోళన

ప్రభుత్వ తీరుపై అభ్యర్థుల ఆగ్రహం
 

Mobile Title: 
Unemployed Protest: మాకు అవకాశం ఇవ్వండి..అభ్యర్థుల ఆందోళన..!
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Monday, May 9, 2022 - 18:33
Request Count: 
82
Is Breaking News: 
No