Medak incident: రంగంలోకి దిగిన బండి సంజయ్.. మెదక్ ఘటనపై పోలీసులకు కీలక ఆదేశాలు..

Bandi sanjay: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మెదర్ ఘటనపై సీరియస్ అయ్యారు. కేంద్ర మంత్రి హోదాలో పోలీసులకు కీలక ఆదేశాలు జారీచేశారు.   

Written by - Inamdar Paresh | Last Updated : Jun 16, 2024, 06:03 PM IST
  • గోవుల తరలింపు నేపథ్యంలో అల్లర్లు..
  • మెదక్ లో హైటెన్షన్..
Medak incident: రంగంలోకి దిగిన బండి  సంజయ్.. మెదక్ ఘటనపై పోలీసులకు  కీలక ఆదేశాలు..

Bandi sanjay serious on Medak Riots: కేంద్ర హోమ్ శాఖ సహయ మంత్రి బండి సంజయ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. మెదర్ అల్లర్లపై ఆరా తీశారు. బక్రీద్ నేపథ్యంలో ఒక వర్గం వారు గోవులను తరలింపును.. బీజేపీ, విశ్వహిందు పరిషత్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవలు జరిగాయి. అది కాస్త కత్తిపొట్లకు దారితీసింది. ఈనేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘటన స్థలానికి చేరుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. కొన్ని దుకాణాలను ఆందోలన కారులు ధ్వంసం చేయడం జరిగింది.  అదే విధంగా కత్తిపోట్లకు గురైన వారిని, ఆస్పత్రికి తరలించారు. మెదక్ కు భారీ ఎత్తున పోలీసు బలగాలను తరలించారు.

Read more; Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..

శనివారం (జూన 15వ తేదీన) రాత్రి మెదక్ పట్టణంలో జంతువధ, గోవుల తరలింపు విషయంలో ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో.. మెదక్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వెంటనే రంగ ప్రవేశం చేసిన పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయితే.. తీవ్రంగా శ్రమించిన పోలీసులు.. మొత్తానికి ఘర్షణ వాతావరణాన్ని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో పోలీసులు వన్ సైడ్ సపోర్టుగా పనిచేశారని, అమాయకులపై కేసులు పెట్టి, తప్పులుచేసినవారిని వదిలేశారంటూ ఆరోపణలు చేశారు. దీంతో ఇది కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది.

మరోవైపు బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. ముంబై నుంచి నేరుగా శంషాబాద్ చేరుకున్నారు. ఎక్స్ వేదికగా మెదక్ కు వెళ్లి పరిస్థితిపై ఆరా తీస్తానని ప్రకటించారు. దీంతో ముందు జాగ్రత్తగా పోలీసులు, రాజాసింగ్ ను శంషాబాద్ లోనే అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రంగంలోకి దిగారు. తొలిసారిగా.. కేంద్ర మంత్రి హోదాలో మెదక్ అల్లర్ల విషయంలో స్పందించారు. పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ చేసి ఘటనపై ఆరా తీశారు.

Read more; Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..

మెదక్‌ శాంతి భద్రతలకు చర్యలు తీసుకొవాలన్నారు. రెచ్చగొట్టే పనులు చేసు వారిని వదలొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా.. అమాయకులపై ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ కేసులు పెట్టొద్దని ఆదేశించారు. పోలీసులు పూర్తిగా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని బండి సంజయ్ సూచించారు. ఈ ఘటన నేపథ్యంలో.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా మెదక్‌లో భారీగా పోలీసులను మోహరించారు. ఇదిలా ఉండగా.. అల్లర్ల నేపథ్యంలో బీజేపీ ఇవాళ మెదక్ బంద్‌కు పిలుపునిచ్చింది. ప్రస్తుతం మెదక్ వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మెదక్ పట్టణంలో ప్రస్తుతం 144 సెక్షన్ కొనసాగుతుంది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News