VROs News: వీఆర్వోల గురించి ఆరా తీస్తున్న సర్కారు.. స్వచ్ఛంద పదవీ విరమణపైనా నిర్ణయం!!

VROs in Telangana: వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసినప్పటి నుంచి ఖాళీగా ఉంటూ వస్తున్న వీఆర్వోలను జిల్లాల వారీగా లాటరీ పద్ధతిలో వివిధశాఖలకు కేటాయించిన సంగతి తెలిసిందే. మొత్తం 98 శాతం మంది వీఆర్ఓలు తమకు కేటాయించిన శాఖల్లో చేరి విధులకు హాజరవుతున్నారు.

Written by - Pavan | Last Updated : Aug 4, 2022, 09:27 PM IST
  • వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసినప్పటి నుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్న వీఆర్ఓలు
  • రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,137 వీఆర్ఓలు
  • వీఆర్ఓలను ఇటీవలే వివిధ శాఖలకు కేటాయించిన సర్కారు
VROs News: వీఆర్వోల గురించి ఆరా తీస్తున్న సర్కారు.. స్వచ్ఛంద పదవీ విరమణపైనా నిర్ణయం!!

VROs in Telangana: వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసినప్పటి నుంచి ఖాళీగా ఉంటూ వస్తున్న వీఆర్వోలను జిల్లాల వారీగా లాటరీ పద్ధతిలో వివిధశాఖలకు కేటాయించిన సంగతి తెలిసిందే. మొత్తం 98 శాతం మంది వీఆర్ఓలు తమకు కేటాయించిన శాఖల్లో చేరి విధులకు హాజరవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,137 వీఆర్ఓలు ఉండగా.. వారిలో 5014  మంది తమకు కేటాయించిన శాఖల్లో చేరి చార్జ్ తీసుకున్నారు. గతంలో ప్రభుత్వం జారీ చేసిన 121వ జీవోను సవాలు చేస్తూ కొంత మంది వీఆర్ఓలు కోర్టుకు వెళ్లగా.. 19 మందికి మాత్రం కోర్టు స్టేటస్ కో ఇవ్వడం కూడా తెలిసిందే. అయితే, ఈ 19 మంది వీఆర్వోలలోనూ దాదాపు 15 మంది వీఆర్ఓలు విధుల్లో చేరినట్టు తెలుస్తోంది.

వీఆర్ఓలు తమకు కేటాయించిన శాఖల్లో చేరి విధులకు హాజరు అవుతున్నారో లేదా అనే అంశంపైనే స్పష్టత తీసుకునేందుకు ప్రభుత్వం వైపు నుంచి నేడు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. రెవిన్యూ శాఖతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ వీఆర్ఓలను ఎట్టి పరిస్థితుల్లోనూ రెవిన్యూ శాఖలో  కొనసాగించడానికి వీల్లేదని గతంలోనే తేల్చిచెప్పిన సర్కారు.. తాజాగా నేడు జరిగిన సమావేశంలోనూ మరోసారి స్పష్టం చేసినట్టు సమాచారం. 

వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడం మొదటి నుంచీ వ్యతిరేకిస్తూ వస్తున్న కొంతమంది వీఆర్వోలు.. లాటరీ పద్ధతిలో తమను రెవెన్యూ శాఖ నుంచి మరో శాఖకు బదిలీ చేయడంపై కూడా తమ నిరసన వ్యక్తంచేస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వంపై న్యాయ పోరాటం చేసేందుకు చట్టబద్ధంగా తమకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. దీంతో ఒకవేళ ఎవరైనా వీఆర్ఓలు తమకు కేటాయించిన శాఖల్లో చేరకుండా స్వచ్ఛంద పదవీ విరమణ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టయితే.. నిబంధనల లోబడి వారికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం ఉన్నతాధికారులకు సూచించినట్టు తెలుస్తోంది.

Trending News