Indian Cough Syrups Banned: ఇండియాలో తయారైన నాలుగు దగ్గు సిరప్‌లలో ప్రమాదకరమైన రసాయానాలు ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టంచేసింది. వాటిలో ప్రాణాంతకమైన విషపూరిత రసాయానాలు ఉన్నందున ఆయా కాఫ్ సిరప్స్‌పై నిషేధం విధిస్తున్నట్టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెల్లడించింది.
Indian Cough Syrups Banned: భారత్‌లోని మెయిడెన్ ఫార్మాసుటికల్ లిమిటెడ్ కంపెనీలో తయారైన నాలుగు రకాల కాఫ్ సిరప్‌లపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిషేధం విధించింది. దీంతో భారత సర్కారు నేతృత్వంలోని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆ నాలుగు దగ్గు సిరప్‌లపై విచారణకు ఆదేశించింది.